టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు సుకుమార్.తన సినిమా లే తాను ఏంటో చెప్తాయి.స్వతహాగా లెక్కల మాస్టర్ అయినా సుకుమార్(Sukumar) తన మొదటి సినిమా ఆర్య కోసం చాల కష్ట పడ్డారు అంట.తాను రాసుకున్న లవ్ స్టోరీ కొత్త గా ఉండటం తో అప్పటి హీరో లు అయినా జూనియర్ ఎన్టీఆర్ ,ప్రభాస్ ,రవి తేజ ,నితిన్ లాంటి వాళ్ళ కి కథ చెప్పి వారితో ఆ కథ ని తీయలేకపోయారు.దిల్ రాజు గారు అప్పుడే గంగోత్రి సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ తో చేద్దాం అని అల్లు అర్జున్(Allu arjun) గారికి కూడా కథ బాగా నచ్చడం తో ఆర్య(Aarya) సినిమా ని చేసారు.ఆ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇప్పటికి కూడా ఆర్య ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది. మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎప్పటి నుంచో తన మైండ్ లో ఉన్న ఒక కథ ని తన రెండవ సినిమా గా చేయాలి అని ఎంతగానో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు సుకుమార్.ప్రస్తుతం మన దేశం లో యువత చదవు మీద శ్రద్ద లేకుండా అమ్మాయిలు ,ఫ్యాక్షన్ అంటూ గ్యాంగ్ లు వేసుకుని తిరగడం,ఒక సారి ఫ్యాక్షన్ లోకి దిగాక అక్కడ ఎదురు అయ్యే సమస్యలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే వాటి మీద ఒక మంచి యాక్షన్ కథ ని రెడీ చేసుకున్నాడు సుకుమార్.అయితే తనకు మొదట అవకాశం మరియు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్ కోసమే ఆ కథను సిద్ధం చేసుకుని ఆయనకి వినిపించాడు అంట.
ఇక అప్పటికే బన్నీ ,హ్యాపీ సినిమా ల ను చేసి దేశముదురు సినిమా తో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ జగడం(Jagadam) కథ విన్నాక సూపర్ గా ఉంది మనమే చేద్దాం కాకపోతే కథ లో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పాడు అంట.అయితే తాను రాసుకున్న కథ లో మార్పులు ఏమి చేయను అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసారు. తాను అనుకున్న కథ నే సినిమా గా చేయాలి అని కసి తో అప్పుడే దేవదాసు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) తో జగడం సినిమా చేయాలి అని ఫిక్స్ అయిపోయి మరుసటి రోజు పొద్దునే మూవీ ఓపెనింగ్ స్టార్ట్ చేసారు.
ఆ ఓపెనింగ్ కి గెస్ట్ ల గా అల్లు అర్జున్ ,దిల్ రాజు లను పిలిచి తాను ఎలా అయినా సినిమా తీసి హిట్ కొడతా అని అన్నారు. సుకుమార్ గారి కథ లో కానీ ,రామ్ నటన లో కానీ ఎక్కడ ఇంచ్ కూడా తప్పు లేదు కానీ అప్పటి ప్రేక్షకులు మాత్రం జగడం సినిమా ని ప్లాప్ చేసారు.సినిమా లో సాంగ్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ హైలైట్ అసలు.మూవీ రిలీజ్ అయినా కొన్ని సంవత్సరాల కి సినిమా రిజల్ట్ మీద సుకుమార్ ని అడగక తాను మంచి సినిమా నే చేశాను అని కాకపోతే అది జనాలకి ఎక్కలేదు అంతే అని బదులు ఇచ్చారు.కొంత మందికి అయితే జగడం ఇప్పటికి ఒక క్లాసిక్.