Sree leela: శ్రీ లీల అంత పని చేసిందా?

Posted by venditeravaartha, July 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక్క ఛాన్స్ తో నీ లైఫ్ మారిపోతుంది అంటే ఏంటో అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు శ్రీ లీల ని చూస్తే అది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది.పెళ్లి సందడి సినిమా తో శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కి జత గా కలిసి నటించిన ఈమె మొదటి సినిమా తో సక్సెస్ అందుకోక పోయిన తన కి మాత్రం చాల మంచి గుర్తింపు లభించింది.తన అందం ,అభినయం కి తోడు డాన్స్ ఎక్స్ట్రా గా ఉండటం తో అందరు శ్రీ లీల(sree leela) వెంట పడ్డారు,రవితేజ గారి ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

sree leela

పెళ్లి సందడి సినిమా తర్వాత ఈమెకి టాలీవుడ్ నుంచి బడా హీరో ల తో పాటు గా పెద్ద పెద్ద డైరెక్టర్ లు పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు,అయితే ప్రతి అవకాశాన్ని కూడా ఆలోచించి తనకి నచ్చితే నే ఆ సినిమా కి ఒప్పుకుంటున్నారు శ్రీలీల.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ల అందరి తో సినిమా ల ని ఒప్పుకుని చేస్తున్న శ్రీ లీల ఒక పెద్ద నిర్మాత తన దగ్గర కి వచ్చి ఆఫర్ చేస్తే దానిని సున్నితంగా రిజెక్ట్ చేసి మరొక సినిమా కి కంఫర్మ్ చేసినట్లు సమాచారం ఉంది.అయితే
ఆ పెద్ద నిర్మాత మరి ఎవరో కాదు దిల్ రాజు(Dil raju).

dhamaka

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ ల లో ఒకరు అయినా దిల్ రాజు గారు శ్రీ లీల నటించిన తన మొదటి సినిమా పెళ్లి సందడి చూసి తన కుమారుడు అయినా ఆశిష్ తో  సెల్ఫిష్(selfish) అనే సినిమా కోసం హీరోయిన్ గా శ్రీ లీల ని ఎంపిక చేయాలి అని అనుకున్నారు అయితే తన మొదటి సినిమా అయినా రౌడీ బాయ్స్ డిజాస్టర్ కావడం దానికి తోడు రవితేజ లాంటి స్టార్ హీరో పక్కన మెయిన్ లీడ్ గా అవకాశం రావడం తో దిల్ రాజు గారి ఆఫర్ కి నో చెప్పారు శ్రీ లీల..
డబ్బు ఇస్తే చాలు ఎవ్వరితో అయినా నటించే ఇప్పటి కాలం లో తన కెరీర్ కి హెల్ప్ అయ్యే సినిమా లు మాత్రమే చేస్తున్నారు శ్రీ లీల.ఒక టాప్ ప్రొడ్యూసర్ కి అది తన కొడుకు సినిమా కి నో చెప్పాలి అంటే మాములు విషయం కాదు కదా మరి.ఇప్పుడు శ్రీ లీల స్థానం లో లవ్ టుడే హీరోయిన్ ఇవానా(Ivana) నటిస్తున్నారు.

selfish

1561 views