Prabhas: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సెక్యూరిటీ కోసం అన్ని కోట్లు ఖర్చు చేసారా !

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్(Prabhas) గారి రేంజ్ ఏ స్థాయి లో పెరిగింది అనేది ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.మన తెలుగు రాష్ట్రాల తో పాటు గా హిందీ లోను ప్రభాస్ గారి మార్కెట్ పెరిగింది.తెలుగు లో సరిగా ఆడని సాహూ సినిమా అక్కడ 100 కోట్ల కి పైగా కలెక్షన్స్ సాధించింది అంటే ప్రభాస్ గారి స్టామినా ఏంటో తెలుస్తుంది.రాధే శ్యామ్ డిజాస్టర్ అయినప్పటి కూడా కళ్ళు చెదిరే లైన్ అప్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ గా ఉన్నారు ప్రభాస్..ఇక రాబోయే తన ఆదిపురుష్ సినిమా కోసం భారీ స్థాయి లో ప్రొమోషన్స్ చేస్తున్నా మూవీ టీం ఇటీవల తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు.

adipursh

ఆదిపురుష్(Adipursh) ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీం భారీ ఏర్పాటులని చేసారు.చిన్నజీయరు స్వామి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి తన ఆశీసులు అందచేశారు.ఇక ఈ ఫంక్షన్ కి ముందు ప్రభాస్ మరియు మూవీ టీం అంత తిరుమల శ్రీ వారిని దర్శించుకుని వచ్చారు. తిరుపతి వెంకటేశ్వర గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.ఈవెంట్ కోసం 3 కోట్ల రూపాయలు ని ఖర్చు చేసిన టీం కేవలం ప్రభాస్ గారి సెక్యూరిటీ కోసమే 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

prabhas

మొదట గా తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెంట్ కోసం 500 పైగా పోలీస్ వాళ్ళ ని సెక్యూరిటీ గా ఇచ్చారు.అయితే లక్షల మంది అభిమానులు ఉండటం దానికి తోడు ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ టీం మరొక 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ని నియమించారు
ఆ ప్రైవేట్ సెక్యూరిటీ కోసం అదనంగా మరో 25 లక్షల వరకు ఖర్చు చేసారు అంట.మరి ఇంత భారీ స్థాయి లో చేసిన ఈవెంట్ విజయవంతగా సక్సెస్ అయింది.ఇక జూన్ 16 నా రిలీజ్ కానున్న ఆదిపురుష్ ఎన్ని రికార్డు లను బద్దలు కొడుతుందో చూడాలి.

1298 views