22 కోట్లుపెట్టి కొంటే..3 రోజుల్లో వచ్చిన చిల్లర ఇదా..పాపం బయ్యర్స్!

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ సమ్మర్ బయ్యర్స్ కి ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని బ్రదర్స్ ఈ సీజన్ కి పెట్టిన బొక్క మామూలుది కాదు. భారీ అంచనాల నడుమ విడుదలను అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అక్కినేని నాగ చైతన్య ‘కస్టడీ’ చిత్రం ‘ఏజెంట్’ కంటే పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. టాక్ అయితే ఏజెంట్ వచ్చినంత డిజాస్టర్ టాక్ రాలేదు, డివైడ్ టాక్ వచ్చింది. ఈ టాక్ కి కనీస స్థాయి వసూళ్లు అయినా రాబట్టాలి. కానీ అది జరగలేదు.టీజర్ మరియు ట్రైలర్ బాగుండడం తో హీరో మీద కంటే కూడా డైరెక్టర్ మీద ఎక్కువ నమ్మకం పెట్టి బయ్యర్స్ ఈ సినిమాని 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. మరి ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది. ఇంకా ఎంత రాబట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రెండు రోజులకు కలిపి మూడు కోట్ల 68 లక్షల రూపాయిలు వసూలు చేసింది. మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండి కోటి 82 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు 50 శాతం కంటే ఎక్కువ డ్రాప్స్ ని సొంతం చేసుకొని 80 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది.ఇక మూడవ రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.అలా మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని చెప్తున్నారు.ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 18 కోట్లు వసూలు చెయ్యాలి. అంటే వర్కింగ్ డేస్ లో అద్భుతమైన హోల్డ్ ని చూపించాలన్నమాట, అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు తమిళం లో పెద్ద స్టార్ డైరెక్టర్. రీసెంట్ గానే ఆయన ‘మానాడు’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆయన ఇమేజి ఈ సినిమాకి ఏమైనా ఉపయోగపడుతుందా అని అనుకున్నారు. కానీ తమిళం లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు షేర్ వసూళ్లు రాలేదు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, వెంకట్ ప్రభు కి ఇది మొట్టమొదటి డిజాస్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. ఈ దెబ్బతో ఆయనతో పెద్ద హీరోలు సినిమాలు చెయ్యడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.ఒక్క సినిమా ఈ రేంజ్ లో తలరాత మారుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

5312 views