వెండితెరపై నేరుగా అవకాశాలు రాని వారు బుల్లితెరను నమ్ముకుంటారు. ఇక్కడ కొన్ని రోజుల పాటు హవా సాగించిన తరువాత సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటారు. స్మాల్ స్క్రీన్ పై యాంకర్లుగా అలరించిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తున్నారు. దీంతో సినిమాల్లో అవకాశాలు రాకపోయినా యాంకర్ గా అవకాశం వచ్చిన చాలు అని అనుకుంటున్నారు. అయితే ఒకప్ప్పుడు టీవీల్లో సీరియల్స్ మాత్రమే అలరించేవి. అలాంటి సమయంలో యాంకర్ గా రాణించింది స్వాతి. మా టీవీ ఛానెల్ లో ‘కలర్స్’ పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమం అప్పట్లో యూత్ ను బాగా అలరించింది. దీంతో ఆమెకు కలర్స్ స్వాతి అని బిరుదు ఇచ్చారు. లేటేస్టుగా కలర్స్ స్వాతి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె భర్తతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?
కలర్స్ స్వాతిగా అలరించిన ఈమె ఆ తరువాత వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా నటించింది. ఇందులో స్వాతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు నాని ‘అష్టా చెమ్మ’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఈమూవీతో స్వాతి ఆకట్టుకోవడంతో ఆ తరువాత అవకాశాలు తలుపుతట్టాయ. ఆ తరువాత నితిన్ తో కలిసి ‘స్వామిరార’చేసిన సినిమా సక్సెస్ కావడంతో ఇక స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ తరుణంలో ఆమె ప్రేమలో పడింది.
మలయాళీ కుటుంబానికి చెందిన వికాస్ వాసును ఇష్టపడిన స్వాతిని ఆయనను 2018లో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత వీరిద్దరు థాయ్ లాండ్ వెళ్లి సెటిలయ్యారు. అయితే 2019లో త్రిశూరపురం అనే మలయాళ సినిమాలో నటించింది. దీనిని తెలుగులో త్రిపుర తో రిలీజ్ చేశారు. పంచతంత్రం, తదితర సినిమాల్లో నటిస్తున్న సమయంలో స్వాతి గురించి ఓ ప్రచారం జరిగింది. ఆమె భర్తకు దూరంగా ఉంటుందని, విడాకులు తీసుకుందని ప్రచారం చేసింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు. తను భర్తతో విడిపోలేదని ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లయింది.
తాజాగా మరోసారి ఇదే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే స్వాతి తన ఇన్ స్ట్రాగ్రాంలోని భర్త ఫొటోలను తీసేసింది. మొన్నటికి మొన్న మెగా డాటర్ నిహారిక ముందుగా ఇలాగే చేసి ఆ తరువాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్వాతి కూడా తన భర్తతో దూరంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం స్వాతి భర్త థాయ్ లాండ్ లోనే ఉండగా.. స్వాతి మాత్రం హైదరాబాద్ లో ఉంటోంది. దీంతో వీరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. అయితే లేటేస్ట్ న్యూస్ పై స్వాతి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.