సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని, బుధవారం రాజానగరం నియోజకవర్గం తమ క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మొత్తం 4,32,231/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎల్ఓసి పత్రాన్ని *రుడా చైర్మన్ మరియ రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు* అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని అన్నారు.
అలాగే రాజానగరం నియోజకవర్గం కుదివాన్ చెరువులో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారి విజన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాజనగరం నియోజకవర్గం దివాన్ చెరువు వద్ద ఫారెస్ట్ అకాడమీ మంజూరు చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.