Chiru-Balaya: ఒకే స్టేజి మీద కనిపించనున్న చిరంజీవి ,బాలకృష్ణ! ఫ్యాన్స్ కి ఇక పండగే..

Posted by venditeravaartha, June 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారు వాల్తేర్ వీరయ్య తర్వాత తన తదుపరి చిత్రం భోళాశంకర్ కోసం తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళం ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..రీమేక్ సినిమా ల కి పెట్టిన పేరు అయినా మెహర్ రమేష్ గారు డైరెక్ట్ చేస్తున్న భోళా శంకర్ లో తమన్నా ,కీర్తి సురేష్ మరియు సుశాంత్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.ఇటీవల రిలీజ్ అయినా భోళా మేనియా కి మంచి రెస్పాన్స్ లభించడం తో మూవీ టీం మంచి జోష్ లో ఉన్నారు.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన భోలా శంకర్(Bhola shankar) 11 ఆగస్ట్ 2023న గ్రాండ్ రిలీజ్‌ కాబోతోంది . మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

bhola shankar

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీ టీం నందమూరి బాలకృష్ణ(Balakrishna) గారిని గెస్ట్ గా పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మెగా స్టార్ చిరంజీవి మరియు నటసింహ బాలకృష్ణ ఒకరితో ఒకరు మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు . చాలా సార్లు, వారు ఒకరి సినిమా ఫంక్షన్లకు హాజరయ్యారు మరియు చిరంజీవి గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన బాలయ్య బాబు హాజరు అవుతారు.బాలయ్య 100 వ చిత్రం అయినా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఫంక్షన్ కి కూడా మెగాస్టార్ హాజరు అయ్యారు.. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని నివేదికలు వస్తున్నాయి.

chiru balaya
ఆర్ ఆర్ ఆర్ సినిమా తో మెగా ఫ్యాన్స్,నందమూరి ఫ్యాన్స్ మధ్య మంచి సంబంధాలే ఏర్పడ్డాయి.ఇక ఈ ఫంక్షన్ కి బాలకృష్ణ హాజరు కావడం అందరికీ ట్రీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన వేదాళం చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ అతని సోదరి పాత్రలో నటిస్తోంది.
మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు మరియు ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, సత్య, రష్మీ గౌతమ్, గెటప్ శీను మరియు బిత్తిరి సత్తి కీలక
పాత్రలు పోషిస్తున్నారు.ఆగస్టు 11 న రిలీజ్ కానున్న భోళా శంకర్ తో మెగాస్టార్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం గా అనిపిస్తుంది.

bhola

1122 views