Taapsee Pannu : తన పెళ్లి వార్తలపై మౌనం వీడిన తాప్సీ పన్ను.. పెళ్లి వేదిక ఎక్కడంటే

Posted by RR writings, February 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Taapsee Pannu : ఇటీవలే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసింది. తాజాగా మరో బాలీవుడ్ భామ కూడా పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో తాప్సీ కూడా ఏడడుగులు వేయనుంది. ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకోబోతున్నది ఎవర్ని..? అని అంతా ఆలోచిస్తున్నారు. తాప్సీ పన్ను గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ ‘మథియాస్ బోయ్‌’తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్లు లవ్ జర్నీ చేసిన వీరిద్దరూ.. మార్చి నెల నుంచి పెళ్లి ప్రయాణం మొదలు పెట్టబోతున్నారంట. నేషనల్ మీడియా కథనాలు ప్రకారం.. మార్చి చివరిలో ఈ వివాహం జరగబోతుందని సమాచారం. ఇక ఈ పెళ్ళికి ఉదయపూర్‌ లోని ప్యాలస్ వేదిక కానుందని చెబుతున్నారు. సిక్కు, క్రిస్టియన్ సంస్కృతిలో వివాహం జరగబోతుందట.

ఇక ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్స్ ఎవరూ హాజరు అవ్వరని, కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలు గురించి తాప్సీ మాత్రం నోరు విప్పడం లేదు. మార్చి నెలాఖరులో మీ పెళ్లి జరగబోతుందనే వార్తలో ఎంత నిజముందని తాప్సీ ప్రశ్నించాగా, ఆమె బదులిస్తూ.. “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పై నేను ఎప్పుడూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అంతే, ఎప్పటికీ ఇంతే” అంటూ ఆన్సర్ ఇవ్వకుండా మాట దాటేసారు.

కాగా తాప్సీ తెలుగు సినిమా ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తాప్సీ ఫస్ట్ ఛాయస్ అయ్యారు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో కలిసి ‘డంకీ’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న OTTలో వచ్చింది. అప్పటి నుండి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం కథను ప్రజలు బాగా ఇష్టపడ్డారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

186 views