Tarun: త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనున్న లవర్ బాయ్ తరుణ్! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

చైల్డ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తో పాటు సక్సెస్ అందుకున్న నటుడు తరుణ్(Tarun).. అంజలి సినిమా తో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సూర్య IPS ,ఆదిత్య 369 వంటి సినిమా ల లో కనిపించిన తరుణ్ 2000 లో రీలీజ్ అయినా నువ్వే కావాలి(Nuvve kavali) సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి హైయెస్ట్ కలెక్షన్ లు సాధించిన సినిమా గా నువ్వే కావాలి ఆ సంవత్సరం నిలిచింది..ఇక నువ్వే నువ్వే ,ప్రియమైన నీకు ,నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ ల లో నటించిన తరుణ్ 2018 లో రిలీజ్ అయినా ఇది నా లవ్ స్టోరీ సినిమా తో సినిమా ల నుంచి దూరంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం తరుణ్ తన సినీ కెరీర్ కి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది.ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న తరుణ్ త్వరలోనే ఒక పెద్ద సినిమా ద్వారా మరల రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఇటీవల తరుణ్ తల్లి అయినా రోజా రమణి ఇదే విషయం గురించి చెప్తూ తరుణ్ త్వరలో మీ ముందుకు రానున్నాడు అని చెప్పారు..నువ్వే కావాలి సినిమా కి రచయిత గా పని చేసిన త్రివిక్రమ్(Trivikram) గారి డైరెక్షన్ లో మహేష్ బాబు(Mahesh babu) గారితో వస్తున్న సినిమా లో ఒక ప్రధాన పాత్రా లో తరుణ్ కనిపించనున్నారు అని సమాచారం..ఇక సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమా ల లో తరుణ్ నటించనున్నారు..అయితే అప్పట్లో స్టార్ హీరో అయినా తరుణ్ ఇప్పుడు తన కెరీర్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా సెకండ్ లీడ్ ల లో నటించాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.

1631 views