జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు వేడుకలను జగ్గంపేట నియోజకవర్గం లో వైసీపీ యువ నాయకుడు తోట శ్రీరాంజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్య లో వైసీపీ నాయకులూ కార్యకర్త లు పాల్గొన్నారు ఈ సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసారు. తోట శ్రీ రాంజీ మాట్లాడుతూ 175 స్థానాలు గెలిపించే సామర్థం గల నాయకుడు జగన్ అని రానున్న ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారకం లోకి వస్తుంది అని దానికి ప్రధాన కారణం జగన్ అని చెప్పారు అన్ని నియోజకవర్గాలలో అభిమానులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నరని చెప్పారు జగ్గంపేటలో మరోసారి వైసీపీ విజయం తథ్యం అని రానున్న ఎన్నికల్లో జగ్గంపేట లో అధిక మెజార్టీతో విజయం సాధిస్తుంది అని తెలిపారు.
జగన్ అధికారం లోకి వచ్చాక పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పధకాలు చేసారని ప్రజల్లో జగన్ మీద ఎంతో ప్రేమ ఉందని తెలిపారు తమ కుటుంబం పార్టీకి కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో వైసీపీ విజయమే లక్ష్యం గా ముందుకు పోతామని తెలిపారు ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.