Guess the child: ఈ ఫోటో లో కనిపిస్తున్నా చిన్నారి ని గుర్తుపట్టారా ! ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు!

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ ఫోటో లో కనిపిస్తున్న చిన్నారి 1984 న హైదరాబాద్ లో జన్మించి తన స్కూలింగ్ ,మరియు కాలేజీ ని హైదరాబాద్ లో చదివినప్పటికీ సినిమా ల మీద ఆసక్తి ఎక్కువ ఉండటం తో సినిమా ల వైపు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు.తన చిన్నతనం నుంచి మణిరత్నం గారి సినిమా ల ప్రభావం ఎక్కువ ఉండటం తో డైరెక్టర్ అవ్వాలనే ఆశయం తో సినిమా ల లో అవకాశాల కోసం బాగా కష్టపడ్డారు.ఎన్నో ఆఫీస్ లు తిరిగిన తర్వాత లెజెండరీ డైరెక్టర్ బాపు గారి దగ్గర పని చేసే అవకాశం దక్కించుకున్నాడు.అలా క్లాప్ డైరెక్టర్ గా ,అసిస్టెంట్ గా పని చేసిన తర్వాత అనుకోని విధముగా 2008 తనకి హీరో గా మొదటి అవకాశం లభించింది.

nani

మోహనకృష్ణ ఇంద్రగంటి గారి డైరెక్షన్ లో 2008 లో రిలీజ్ అయినా అష్టచమ్మ సినిమా ద్వారా
హీరో గా పరిచయం అయినా ఆ క్లాప్ డైరెక్టర్ ఏ ఘంటా నవీన్ బాబు(నాని).తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న నాని(Nani) ఇక ఆ తర్వాత కాలం లో వరుసగా రైడ్ ,భీమిలి కబడ్డీ జట్టు ,అలా మొదలైంది,పిల్ల జమీందార్ ,ఈగ లాంటి బ్లాక్ బస్టర్ ల తో టాలీవుడ్ టాప్ హీరో ల లో ఒకరిగా ఎదిగారు.2015 నుంచి 2019 వరకు వరుసగా 9 బ్లాక్ బస్టర్ హిట్ల తో ట్రిపుల్ హ్యాట్రిక్ హీరో గా గా రికార్డు సృష్టించారు.

dasara

 

2019 లో రిలీజ్ అయినా జెర్సీ(Jersy) సినిమా తో బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా ఇండియా వైడ్ గుర్తింపు లభించింది.ఆ ఫేమ్ ని వాడుకుంటూ తన తదుపరి చిత్రాలని ఇండియా లో అన్ని భాషల లో రిలీజ్ చేయడానికి రెడీ అయినా నాని ఇటీవల తన బ్లాక్ బస్టర్ మూవీ దసరా(Dasara) ని అన్ని భాషలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు.దసరా ఇచ్చిన సక్సెస్ తో తన 30 వ సినిమా ని కూడా పాన్ ఇండియన్ రిలీజ్ చేయనున్నారు.క్లాప్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయి కి ఎదిగిన నాని..తన న్యాచురల్ యాక్టింగ్ తో యావత్ భారత దేశం లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు.

nani 30

949 views