Tamanna: 30 నిముషాలు కి అన్ని కోట్లా ?

Posted by venditeravaartha, July 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లో ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుంది అనే చెప్పడం చాల కష్టం,ఒక సినిమా తో వారి అదృష్టం మారిపోతూ ఉంటుంది.మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna) మొదట శ్రీ అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత 2007 లో రిలీజ్ అయినా శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక అప్పటి నుంచి వరుస ఆఫర్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.అయితే ఈమె మొదటి నుంచి కూడా కిస్సింగ్ మరియు ఇమిటేట్ సీన్ ల కు దూరంగానే ఉంటూ వచ్చారు,కానీ ఈ మధ్య కాలం లో ఆ బౌండరీ ని కూడా క్రాస్ చేసారు అనే చెప్పాలి.వరుసగా లస్ట్ స్టోరీస్ ఇంకా జీకార్డా వెబ్ సిరీస్ ల లో బోల్డ్ గా నటించిన తమన్నా తాను పెట్టుకున్న నో కిస్సింగ్ పాలసీ ని బ్రేక్ చేసింది.

vijay varma

తమన్నా కి హిందీ ,తమిళ్ తో పాటు తెలుగు లోను మంచి అవకాశాలే వస్తున్నాయి కానీ ఈమె బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా లు ,వెబ్ సిరీస్ ల లో నటించడానికి ముఖ్య కారణం డబ్బు అని తెలుస్తుంది.సాధారణంగా తమన్నా ఒక సినిమా కి తీసుకునే రెమ్యూనిరేషన్ 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది.కానీ ఇటీవలే నెట్ ఫ్లెక్స్ లో రిలీజ్ అయినా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ కోసం తమన్నా ఏకంగా 7 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం.ఈ వెబ్ సిరీస్ లో తమన్నా కేవలం 30 నిముషాలు మాత్రమే కనిపిస్తారు.

tamanna

బాలీవుడ్ నటుడు అయినా విజయ్ వర్మ(Vijay varma) తో లస్ట్ స్టోరీస్ లో తమన్నా చేసిన రొమాన్స్ కి గాను ఆమె చాల పెద్ద మొత్తం లో రెమ్యూనిరేషన్ ని అందుకున్నారు.అయితే ఈ సినిమా ద్వారా విజయ్ వర్మ తో మంచి స్నేహం ఏర్పడింది అని త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇక ఈ వెబ్ సిరీస్ కాకుండా జీకార్డా లో కూడా ఈమె రెమ్యూనిరేషన్ దాదాపు 5 కోట్ల పైన అని తెలుస్తుంది.మొదట నుంచి లవ్ స్టోరీస్ మరియు కంటెంట్ బేస్డ్ సినిమా ల లో నటించిన తమన్నా ఇప్పుడు ఇలాంటి బోల్డ్ సినిమా ల లో నటిస్తుండటం తన అభిమానుల కి కాస్త ఇబ్బందిగానే ఉన్నపటికీ వారు కూడా మిల్కీ బ్యూటీ అందాలను ఎంజాయ్ చేస్తున్నారే చెప్పాలి.

tamanna

1832 views