Sree reddy: శ్రీ రెడ్డి చెప్పినట్టు ఆ హీరో దానికి తప్ప దేనికి పనికి రాడా?

Posted by venditeravaartha, June 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు పుట్టుకొస్తాయి. ఇలా కొందరు రియల్ లైఫ్ లోనూ ఒక్కటైనవారున్నారు. అలా కాకుండా గొడవలు పడి విడిపోయిన వారూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి ఎవరంటే..సినిమాలతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ చెబుతారు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా కొన్ని కార్యక్రమాలతో విపరీతంగా ఫేమస్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన వీడియోలతో ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలో శ్రీరెడ్డి(sree reddy) ఓ హీరో గురించి చేసిన టాక్ హాట్ టాపిక్ అయింది. తనను మోసం చేసిన ఆ హీరో ఎన్నటికీ బాగుపడడు అని ఫైర్ అయింది. అనుకున్నట్లుగా ఆ హీరోకు మొదటిసినిమా డిజాస్టర్ గా మిగిలింది.

actress sri reddy

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండీగా మారారు శ్రీరెడ్డి. సమాజంలో జరిగే రాజకీయ, సినీ విశేషాలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె తన పర్సనల్ విషయాలను కూడా బయటపెడుతూ ఉంటుంది. ఆ మధ్య శ్రీ రెడ్డి ఓ హీరోను ప్రేమిస్తున్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఎవరో కాదు.. దగ్గుబాటి అభిరామ్. ఈయన సినిమాల్లోకి రాకముందే శ్రీరెడ్డితో లవ్ కొనసాగించాడట.

daggubati family

తేజ డైరెక్షన్లో వచ్చిన ‘అహింస’(Ahimsa) మూవీ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో అభిరామ్ హీరోగా పరిచయం అయ్యాడు. అయితే రిలీజైన తరువాత ఈ మూవీ డిజాస్టర్ అని తేలింది. దీంతో అభిరామ్(Abhiram) ను ఎవరూ పట్టించుకోవడం లేదని చాలా మంది నెట్టింట్ల కామెంట్లు పెడుతున్నారు. ఇండస్ట్రీలో పేరున్న దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన ఫ్యూచర్లో నటిస్తాడా? అని కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ahimsa movie

ఇదే సమయంలో కొందరు నెటిజన్లు శ్రీ రెడ్డి చెప్పినట్లుగానే అభిరామ్ సినీ కెరీర్ చీకటిగా మారుతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనను లవ్ చేసి అభిరామ్ మోసం చేశాడని అప్పట్లో శ్రీ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీ రెడ్డి ఉసురు అభిరామ్ కు తగిలిందని అంటున్నారు. అయతే ఇలాంటి మెసేజ్ లపై అభిరామ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అటు శ్రీరెడ్డి మాత్రం సంబరాలు చేసుకుంటుందని కొందరు వీడియోలు పోస్టు చేస్తున్నారు.

965 views