15 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన వసూళ్లు ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు

Posted by venditeravaartha, February 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..పాజిటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది కానీ , కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు..కళ్యాణ్ రామ్ మీడియం రేంజ్ కాబట్టి ఆయన నుండి ఓపెనింగ్స్ ఆశించడం అతిశయమే.

కానీ భింబిసారా వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా కనీస స్థాయి వసూళ్లు రాకపోవడమే ట్రేడ్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..మాస్ మసాలా సినిమాలు చేస్తే కానీ ఓపెనింగ్స్ రావని ‘అమిగోస్’ ని చూస్తే అర్థం అవుతుంది.’భింబిసారా’ సినిమాకి మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇప్పుడు అమిగోస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది.ఇది చాలా పూర్ ఓపెనింగ్ అనే చెప్పాలి, ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది..ప్రస్తుతం వచ్చిన ఓపెనింగ్స్ ట్రెండ్ ని చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అనేది అసాధ్యం అని అనిపిస్తుంది.ఫుల్ రన్ లో భింబిసారా మొదటి రోజు వసూళ్లను అయినా అందుకుంటుందో లేదో అని భయపడుతున్నారు బయ్యర్లు.

ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్ లో కాస్త మంచి వసూళ్లు వస్తాయి, కానీ ‘అమిగోస్’ కి అక్కడ కూడా నిరాశే, ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 50 నుండి 60 వేల డాలర్స్ మాత్రమే వచ్చాయట, అందులో కేవలం ప్రీమియర్స్ నుండే 40 వేల డాలర్లు వచ్చాయి.మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Tags :
942 views