Srihari Son: హీరో శ్రీహరి కొడుకు ఇప్పుడు ఏ రేంజ్ లో తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..!

Posted by venditeravaartha, November 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Srihari Son: తెలుగులో చిన్న చిన్న విలన్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆ తర్వాత హీరోగా రియల్ స్టార్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన శ్రీహరి సినిమా సినిమాకు సక్సెస్ రేట్ ను సైతం పెంచుకున్నారు. రియల్ స్టార్ శ్రీహరిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. అయితే రియల్ స్టార్ శ్రీహరి ఒక్క హేటర్ కూడా లేకపోవడం గమనార్హం. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఆయన ఎంతోమందికి సాయంగా అందించారు. శ్రీహరి లాంటి నటులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు. శ్రీహరి మనస్సు చాలా సున్నితమైనది. చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరని సన్నిహితులు చెప్తుంటారు. శ్రీహరి కాలేయ సంబంధిత సమస్యలతో మరణించారు. అక్షర ఫౌండేషన్ ద్వారా శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దాదాపుగా 100 సినిమాలలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఆయన పెద్ద కుమారుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా ‘రాజ్‌దూత్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాతో అర్జున్ గున్నాల, కార్తీక్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇది కంప్లీట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. 2019లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా తరువాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకోని తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. ఈ ఈవెంట్ కి మంచు మనోజ్, బాబీ కొల్లి, చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి అతిరథులు హాజరయ్యారు. కానీ ఆ సినిమా ఏమైందో ఇప్పటి వరకు తెలియదు.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మేఘాంశ్ మరో సారి తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో మంచి కథల ఎంపికలో ఉన్నాడట. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ ఆయనకు ఓ కథ వినిపించగా తనకు నచ్చి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు దర్శకుడు శ్రీను వైట్ల. కామెడీతో యాక్షన్ మిళితం చేసి హిట్ కొట్టే శ్రీను వైట్ల మేఘాంశ్ తో చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కావడంతో చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్ల ఎంపికలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీహరి మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. శ్రీహరి కుటుంబానికి దేవుడు మంచి చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఇండస్ట్రీకి శ్రీహరి లేని లోటును ఎవరూ తీర్చలేరని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Tags :
5086 views