Salaar: TRP రేటింగ్స్ లో ‘బ్రో ది అవతార్’ ని కూడా దాటలేకపోయిన ‘సలార్’..ఇదేమి దారుణం!

Posted by venditeravaartha, May 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్ గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అందరూ ఆశించినట్టు ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టలేకపోయింది కానీ, దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు ని అందుకుంది. అయితే అందరూ ఆశించిన వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా అందుకోలేకపోవడానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించకపోవడం వల్లే. అందుకు ఉదాహరణ ఈ సినిమా టీఆర్ఫీ రేటింగ్స్ అని చెప్పొచ్చు.

రీసెంట్ గానే ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. భారీ ప్రొమోషన్స్ తో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ చిత్రానికి డిజాస్టర్ రేంజ్ రేటింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకి కేవలం 6.5 రేటింగ్స్ మాత్రమే వచ్చిందని అంటున్నారు. ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాని టెలికాస్ట్ చేస్తే ఇంత తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ రావడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఫ్లాప్ చిత్రం గుంటూరు కారం ని ఇటీవలే జెమినీ టీవీ లో టెలికాస్ట్ చెయ్యగా 9 కి పైగా రేటింగ్స్ వచ్చాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్లాప్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ని జీ తెలుగు లో టెలికాస్ట్ చెయ్యగా ఆ సినిమాకి కూడా 8 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.

ఇలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో ప్రభాస్ కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. ప్రభాస్ గత చిత్రాలు సాహూ కి జీ తెలుగు లో ఆరు రేటింగ్స్ వచ్చాయి. అలాగే రాధే శ్యామ్ చిత్రానికి 8 రేటింగ్స్ రాగా, ఆది పురుష చిత్రానికి 9 రేటింగ్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గత చిత్రాలు వకీల్ సాబ్ కి 20 రేటింగ్స్ రాగా, భీమ్లా నాయక్ కి 9 రేటింగ్స్ వచ్చాయి. అలాగే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి 24 రేటింగ్స్ రాగా, సర్కారు వారి పాట చిత్రానికి 9 రేటింగ్స్ వచ్చాయి. ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కంటే ప్రభాస్ చాలా వెనకబడి ఉన్నాడు అనే విషయం ఈ సినిమాలతో అర్థం అయ్యింది.

222 views