SAI DHARAM TEJ:జూనియర్ ఎన్టీఆర్ అందించిన సపోర్ట్ నేను ఎప్పటికి మర్చిపోలేను!

Posted by venditeravaartha, April 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరో ల లో అందరికి నచ్చే హీరో సాయి ధరమ్ తేజ్ ,ఇండస్ట్రీ లో ఉన్న తోటి హీరో ల తో చాల స్నేహం గా ఉంటారు,తన రాబోయే పాన్ ఇండియన్ చిత్రం ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్ ల లో భాగం గా మీడియా తో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ కాకుండా ఇండస్ట్రీ నుంచి తనకు సపోర్ట్ ఇచ్చిన వారి లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు సపోర్ట్ చేసాడు అని చెప్పారు .

కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 21 ఏప్రిల్ 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లు విపరీతమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి మరియు గత సంవత్సరం బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి ప్రాజెక్ట్ ఇదే.సాయిధరమ్ తేజ్ ఏ పని చేసినా మెగా ఫ్యామిలీ మొత్తం తనకు అండగా నిలబడ్డారని, మెగా ఫ్యామిలీతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. తాను సినిమాల్లోకి రాకముందే తనకు ఎన్టీఆర్ గురించి తెలుసునని, తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్టీఆర్ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని అన్నారు.

విరూపాక్ష విషయానికి వస్తే, ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, సునీల్, అజయ్ మరియు బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అజనీష్ లోకనాథ్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.

556 views