Meena : హీరోయిన్ మీనా రెండవ పెళ్లిపై వీడిన సస్పెన్స్..ఇంకెన్ని రోజులో ఇలా!

Posted by venditeravaartha, September 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రముఖ నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణంగా మీనా భర్త విద్యాసాగర్ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో నటి మీనా చాలా కుంగిపోయారు. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమై బయటకు కూడా రాలేదు. తర్వాత మీనా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే కూతురుకు బంగారు భవిష్యత్‌ను అందించే ప్రయత్నంలో జరిగిన విషాదాన్ని మర్చిపోయేందుకు మీనా చాలా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తన కూతురుకు అన్నీ తానై చూసుకుంటోంది. ఈ క్రమంలోనే కాస్త బాధనుంచి ఉపశమనం పొందేందుకు మధ్య మధ్యలో సినిమాలు కూడా చేస్తుంది.

ఇది ఇలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత మీన మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సార్లు ఆమె వీటిని ఖండించింది. అదంతా ఏం లేదని అవన్నీ వట్టి పుకార్లని కొట్ట పారేసింది. అయినా ఆమె రెండో పెళ్లిపై రూమర్ల ఆగడం లేదు. ఒకానొక సందర్భంలో మీనా కూతురు నైనిక కూడా తన తల్లిపై వస్తున్న పుకార్లపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది. ఓ ఈవెంట్‌కు తల్లితో హాజరైన నైనిక.. ‘ మా అమ్మ కూడా మనిషే.. ఇలాంటి పుకార్లు, వార్తలు రావడం వల్ల తాను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

తాజాగా మీనా రెండో పెళ్లి పై ఆమె స్నేహితురాలు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కాలా స్పందించారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తనకు మీనా, ఆమె కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉందన్నారు. ‘నేను, మీనా స్నేహితులుగా కంటే సిస్టర్లుగానే ఎక్కువ కలిసిపోయాం. ఏ కష్టమొచ్చినా వెంటనే ఆమె దగ్గర వాలిపోతాను. తన భర్త విద్యా సాగర్‌ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మూడు నెలల పాటు ఆమె దగ్గరే సాయంగా ఉన్నాను. కానీ ఏం చేయలేకపోయాం. ఆమె జీవితంలో జరగకూడని విషాదం జరిగిపోయింది. భర్త చనిపోయాక తాను బాగా కుంగిపోయింది. ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. మాటల మధ్యలో ఓ సారి రెండ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాను. దానికి ఆమె ఒప్పుకోకపోగా.. నామ్మీదే కోప్పడింది. స్నేహితురాలిని అని కూడా చూడకుండా ఇలాంటి విషయాలు నీకు అనవసరం.. నా పెళ్లి గురించి అయితే ఇక నాతో మాట్లాడకు అంటూ ముఖం మీదే చెప్పేసింది. నా భర్త పోయినా నాకు కూతురు ఉంది. తన బాధ్యత ఇప్పుడు నా భుజాలపై ఉంది. తనను చూసుకుంటూ ఉండిపోతానంది’ అంటూ చెప్పుకొచ్చింది కాలా మాస్టర్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆమె రౌడీ బేబీ అనే చిత్రంలో నటిస్తోంది.

100 views