Priyanka Chopra: జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ బెస్ట్..కానీ ఇప్పటి వరకు నేను #RRR చూడలేదు : ప్రియాంక చోప్రా

Posted by venditeravaartha, May 16, 2023

ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా ప్రపంచ వ్యాప్తం గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే..మూవీ తో పాటు ఆ సినిమా లో పని చేసిన హీరో లు కూడా అదే స్థాయి లో ప్రపంచం అంత గుర్తింపు పొందారు..నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తో భారత దేశ సినిమా కి మరింత గుర్తింపు లభించింది..పలు అవార్డు లు పొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుపొందక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ప్రియాంక చోప్రా(Priyanka chopra) ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటు ఆస్కార్ అవార్డు లు గెలుపొందిన ,నామినేట్ అయినా వారందకీ ఒక పార్టీ ఏర్పాటు చేసారు.. ఆ టైం లో ఆర్ ఆర్ ఆర్ టీం తో ముచ్చటించారు ప్రియాంక చోప్రా.

అయితే ఇటీవల ఆమె విలేకర్ల తో ఇంటరాక్ట్ అయ్యారు ,ఇందులో ఎన్టీఆర్(NTR) మరియు రామ్ చరణ్(Ram charan) మధ్య ఎవరు అందంగా ఉన్నారు అనే ప్రశ్నకు ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ఇటీవల ఎన్టీఆర్‌ని కలిశాను ,మాట్లాడాను .తారక్ గొప్ప నటుడు అలానే రామ్ చరణ్ తో ఇదే వరకే పరిచయం ఉంది తన తో సినిమా కూడా చేశాను..ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ని యావత్ ఇండియా చాలా ఇష్టపడుతున్నారు. ఇలాంటి టైం లో ఎవరు ఇష్టం అని ఇలా చెప్పగలను అన్నారు..అయితే ఖచ్చితంగా ఒక పేరు చెప్పాలి అంటే రామ్ చరణ్ తో పని చేసిన అనుభవం ఉండటం తో రామ్ పేరే చెప్పాలి అన్నారు.

మరొకరు మాట్లాడుతూ రామ్ చరణ్‌ను భారతదేశపు బ్రాడ్ పిట్‌(Brad pit) గా అనడం పై ఆమె మాట్లాడుతూ, “రామ్‌కు అపారమైన చరిష్మా ఉంది మరియు అతను చాల మంచి వాడు,నాకు బ్రాడ్ పిట్ తెలియదు మరియు అతను మంచివాడో కాదో నాకు తెలియదు, కానీ రామ్ మంచివాడు. రామ్ చరణ్ మరియు బ్రాడ్ పిట్‌లలో ఎవరినైనా ఎంచుకోమని అడిగిన ప్రశ్న కి బ్రాడ్ పిట్ ని తాను చిన్నప్పటి క్రష్ అని ఆయనతో రామ్ ని పోల్చడం సరికాదు అని వెల్లడించింది.తాను ఆర్‌ఆర్‌ఆర్ చూడలేదని ప్రియాంక అంగీకరించి ఆశ్చర్యపరిచింది. తాను సినిమాలు చూడడం మానేసి టీవీ షోలు మాత్రమే చూస్తున్నానని చెప్పింది.

1686 views