Poonam kaur-Pawan Kalyan:అసలు మీది అహంకారమా ? లేక అజ్ఞానమా ! ఉస్తాద్ భగత్ సింగ్ మీద పూనమ్ కౌర్ ఘాటైన వ్యాఖ్యలు !

Posted by venditeravaartha, May 11, 2023

2006 లో రిలీజ్ అయినా మాయాజాలం సినిమా ద్వారా తెలుగు సినిమా కి పరిచయం అయినా బ్యూటిఫుల్ హీరోయిన్ పూనమ్ కౌర్ ,ఈమె నటించిన సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు ఈమెకు లభించింది మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వారానే అని చెప్పాలి.2019 ఎన్నికల సమయం లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.కొంత కాలం నుంచి పవన్ కళ్యాణ్ మీద నే కాకుండా త్రివిక్రమ్ మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్న పూనమ్ కౌర్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వచ్చారు.అయితే ఈ మధ్య ఈమె కాస్త నెమ్మదించిన ఈ రోజు ఉదయం రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా పోస్టర్ ని ఉద్దేశించి ఈమె చేసిన ట్విట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కలయిక లో వస్తున్న రెండవ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ,ఈ రోజు మే 11 నా ఫస్ట్ గ్లిప్స్మ్
రిలీజ్ కానుంది ,ఈ సందర్భం గా మూవీ టీం రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ని ఉద్దేశించి పూనమ్ చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ ని కోపం కి గురిచేశాయి.అవి ఏంటి అంటే భగత్ సింగ్ గారిని కించపరిచే ఉద్దేశం తోనే పోస్టర్ లో హీరో కాళ్ళ కింద అయన పేరు ఉంచారు ,అసలు ఇది పిచ్చితనం అనుకోవాలా లేక అమాయకత్వం అనుకోవాలా అని ట్విట్ చేసారు.దానికి కొనసాగింపు గా స్వతంత్ర సమరయోధుల ను గౌరవించడం తెలుసుసుకోవాలి అంతే కానీ వారిని కించపరచ కూడదు,నీ సినిమా పోస్టర్ లో అయన పేరు ని కాళ్ళ కింద పెట్టడం ఏంటి ఇది అహంకారమా ? లేక అజ్ఞానమా అని మండిపడుతోంది.మరి ఆమె ట్విట్ కి రిప్లై గా పవన్ ఫ్యాన్స్ స్పందిస్తూ నీకు గుర్తింపు రావడానికి మా మీద పది ఎవడటం దేనికి ,అంత దేశ భక్తి ఉంటె భగత్ సింగ్ గురించి ఒక 5 నిముషాలు మాట్లాడు చూద్దాం అని కౌంటర్ ఇచ్చారు.

1955 views