Phalana Abbayi Phalana Ammayi Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ ఫుల్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

Posted by venditeravaartha, March 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరో ల లో లవ్ అండ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ లో యాక్ట్ చేయాలి అంటే ‘నాగశౌర్య’ చాలా బాగా సెట్ అవుతాడు ,తాను ఇది వరకు నటించిన చాలా సినిమా లు ఈ కోవకే చెందినవి. ముఖ్యం గా శ్రీనివాస్ అవసరాల గారి డైరెక్షన్ లో చేసిన తన మొదటి సినిమా ”ఊహలు గుసగుసలాడే’ చాలా పెద్ద హిట్ సాధించింది ,తర్వాత వీరి కలయిక లో వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించింది .వీళ్ళిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? హ్యాట్రిక్ సాధించారా లేదా అని చూద్దాం?

Phalana Abbayi Phalana Ammayi Movie Review

కథ లో కి వెళ్తే సంజయ్ (నాగశౌర్య) బీటెక్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ నుంచి అనుపమ (మాళవికా నాయర్) సేవ్ చేస్తుంది. తొలుత ఫ్రెండ్స్ అవుతారు. ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడతారు. అనుపమ సీనియర్ కావడంతో ఏడాది ముందుగా చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. వేరే సిటీలో ఆమెకు ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసినందుకు, తనకు దూరంగా వెళుతున్నందుకు సంజయ్ హ్యాపీగా ఉండదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో స్నేహం మొదలు అవుతుంది. సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? కొన్నాళ్ళ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు ఏం జరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల), వాలెంటైన్ (అభిషేక్ మహర్షి), కీర్తి (శ్రీవిద్య) పాత్రల పరిధి ఏమిటి? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Phalana Abbayi Phalana Ammayi Movie Review

హిందూ సంప్రదాయంలో పెళ్లిలో ఏడు అడుగులు వేస్తారు. జీవితంలో ఓ యువతి, యువకుడు వివిధ దశల్లో వేసిన ఏడు అడుగుల సమాహారమే ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఆ మాటకు వస్తే శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో కథ కంటే కథనం, కామెడీ ఎప్పుడూ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ అవసరాల మార్క్ కామెడీ కొన్ని సీన్లలో కనిపించింది. మొత్తం సినిమాగా చూస్తే ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది.

Phalana Abbayi Phalana Ammayi Movie Review

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రారంభం బావుంది. కాలేజీలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడం చాలా సినిమాల్లో చూశాం. అయితే ఆ సన్నివేశాలను శ్రీనివాస్ అవసరాల డీల్ చేసిన విధానం బావుంటుంది. కొన్ని సీన్లు నవ్విస్తాయి. దర్శకత్వంలో ఆయన మార్క్ కనిపించిన సీన్లు ఉన్నాయి. భావోద్వేగాలు, కథలో కాన్‌ఫ్లిక్ట్ పరంగా డెప్త్ లేదు. హీరో హీరోయిన్లు విడిపోవడానికి సరైన కారణం కనిపించదు. క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు హీరో చెప్పే రీజన్ కూడా కన్వీన్సింగ్ గా అనిపించదు. పార్టులు పార్టులుగా చూస్తే,సన్నివేశాలు బావుంటాయి. కానీ, కథగా మెప్పించడం కష్టం, ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ కనిపిస్తూ ఉంటుంది.

Phalana Abbayi Phalana Ammayi Movie Review

కళ్యాణి మాలిక్ సంగీతంలో కొన్ని పాటలు బావున్నాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి పాడిన పాట అంతా గా నచ్చదు . నేపథ్య సంగీతం బాగుంది . సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా ని చాలా రిచ్ గా ప్రెసెంట్ చేయడం లో సినిమా యూనిట్ సక్సెస్ అయ్యారు.

Phalana Abbayi Phalana Ammayi Movie Review

ఇక నటి నటుల పనితీరు ని చూస్తే హీరో గా నాగశౌర్య చాలా చక్కగా చేశారు. లుక్స్ పరంగా చాలా చేంజ్ చూపించారు. నటుడిగా కూడా చాలా బాగా చేశారు. ఇటువంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాల్లో ఆయన ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. ఇందులో కూడా ఇచ్చారు. మాళవికా నాయర్ నటన ఒకే. కానీ, లుక్స్ పరంగా చేంజ్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. మిగతా నటీనటుల్లో అభిషేక్ మహర్షి నటన ఆకట్టుకుంటుంది.

Phalana Abbayi Phalana Ammayi Movie Review

చివరిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి మెయిన్ రీజన్ శ్రీనివాస్ అవసరాల. ఆయన మార్క్ కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అందువల్ల, ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇవ్వడంలో సినిమా మంచి సక్సెస్ అయింది అనే చెప్పాలి.

రేటింగ్ : 2 .75 / 5

1271 views