ఊరమాస్ లుక్ లో పవన్, సాయి ధరమ్ తేజ్..: టీజర్ అప్డేట్

Posted by venditeravaartha, June 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కల్యాన్ లేటేస్టుగా నటించిన చిత్రం ‘బ్రో’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి చెందిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చినట్లయింది. సముద్రఖని డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ జూలై 28న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అయితే జూన్ 29న టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో లేటేస్టుగా చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ ఉర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు.

ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ ను చూస్తే అచ్చం మెగాస్టార్ చిరంజీవిలాగే కనిపిస్తున్నాడు. మెగా హీరో చిరు ముఠామేస్త్రీలోని గెటప్ ను సాయిధరమ్ తేజ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ సైతం లుంగిలో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. పవన్ తమ్ముడు సినిమాలో ‘ఏ పిల్లా నీపేరు లవ్లీ’ అనే సాంగ్ లో ఇలా లుంగీతో పాటు నోట్లో బీడీతో కనిపిస్తారు. మళ్లి ఇపుడే అలా కనిపించి ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇలా ఊర మాస్ లుక్ లో పవన్ చూసి ఆడియన్స్ పండుగ చేసేందుకు రెడీ అవుతున్నారు.

గతంలోలాగే ‘బ్రో’ టీజర్ ను కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. పవన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత వరుస హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ‘బ్రో’ కూడా అదిరిపోతుందని అంటున్నారు. దశాబ్దాల కాలంలో పవన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ సెకండ్ ఇన్నింగ్ష్ స్టార్ట్ చేసిన తరువాత ఆయన క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

సముద్రఖని డైరెక్షన్లో వస్తున్న బ్రో ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కుచిబొట్ల నిర్మిస్తున్నారు. ఎప్పటిలాగే దీనికి కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే నిర్వహిస్తున్నాడు. డైలాగ్ లు కూడా ఆయనే రాశాడు. ఇందులో పవన్ తో పాటు కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ ను థమన్ అందిస్తున్నారు.అయితే టీజర్ రోజు ఎలాంటి పండుగ వాతావరణం ఉంటుందో చూడాలి.

Tags :
2202 views