Pareshan: పరేషాన్ మూవీ రివ్యూ !

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మాసూదా సినిమా తో అందరిని ఆకట్టుకున్న తిరువీర్(Thiruveer) ఇప్పుడు మరొకసారి అందరిని పరేషాన్(Pareshan) చేయడానికి రెడీ అయ్యారు.దగ్గుబాటి రానా సమర్పణ లో రూపక్ రొనాల్డ్సన్ డైరెక్షన్ లో జూన్ 2 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది పరేషాన్ మూవీ .తక్కువ బడ్జెట్ తో కామెడీ ఏ ప్రధాన అంశం తో మన ముందుకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ని ఎంత వరకు అలరించిందో చూద్దాం.

pareshan

కథ: ఇస్సాక్ (తిరువీర్) తన స్నేహితుల తో కలిసి సింగరేణి ప్రాంతం లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు.స్వతహాగా మద్యానికి బానిసలు అయినా వీరు ఎలాంటి పరిస్థితులు వచ్చిన మద్యం మాత్రం తప్పకుండా తాగుతూ ఉంటారు.అయితే వీరి స్నేహితుల లో సత్తి ,పాషాల కి డబ్బు అవసరం కావడం తో ఇస్సాక్ వారికీ తన తండ్రి దగ్గర ఉన్న డబ్బులు ను ఇస్తాడు.ఇస్సాక్ తన లవర్ అయినా శిరీష తో మంచి సంబంధం కలిగి ఉంటాడు తద్వారా ఆమె ప్రెగ్నెట్ అవుతుంది.ఇలా అయినా అబార్షన్ చేయించాలి అని డబ్బులు కోసం తన ఫ్రెండ్స్ ని తాను ఇచ్చిన డబ్బులు అడిగితే వారు ఇవ్వరు.అక్కడ తో ఆగకుండా సత్తి ఇస్సాక్ నుంచి డబ్బు ని దోచుకుని పారిపోతాడు.తన దగ్గర ఉన్న డబ్బులు పోవడం,శిరీష్ అబార్షన్ ఇంట్లో సమస్యలు ఇలా తన ప్రాబ్లెమ్ లని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ.

pareshan movie

విశ్లేషణ:పరేషాన్ అనేది ఒక పెల్లెటూరి కథ.తెలంగాణ యొక్క భాష ,అక్కడ సంప్రదాయాలు అలవాట్లు మీద చేసిన సినిమా.ఇందులో నటించిన తిరువీర్ తన కామెడీ టైమింగ్ మరియు ఎక్స్ప్రెషన్ ల తో ఆకట్టుకున్నాడు.ఫస్ట్ హాఫ్ వరకు మంచి కామెడీ తో ముందుకు తీసుకుని వెళ్లిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో దానిని మిస్ అయ్యాడు అనే చెప్పాలి.ఇస్సాక్ మరియు అతని స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మినహా సెకండ్ హాఫ్ డల్ గా అనిపిస్తుంది..
ఈ సినిమా కి మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.ఇక డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ తన జాబ్ ని పర్ఫెక్ట్ గా చేసారు అనే చెప్పాలి.మొత్తానికి ఒక రెండు గంటలు సరదాగా నవ్వుకునేందుకు మంచి టైం పాస్ మూవీ పరేషాన్.
పాజిటివ్:తిరువీర్,కామెడీ ,ఫస్ట్ హాఫ్ ,మ్యూజిక్ ,డైరెక్షన్.
నెగటివ్:సెకండ్ హాఫ్ ,స్క్రీన్ ప్లే.
రేటింగ్:3 / 5

969 views