NTR:ఇండస్ట్రీ హిట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పలు..ఇంత ఫేక్ అవసరమా!

Posted by venditeravaartha, May 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండస్ట్రీ హిట్ కి నిర్వచనం ఏంటి అంటే గతం లో ఏదైనా సినిమా సాధించిన కలెక్షన్ ని క్రాస్ చేసి దాని అంటే ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమా ని ఇండస్ట్రీ హిట్ గా పరిగణిస్తారు.మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 1931 లో రిలీజ్ అయినా ‘భక్త ప్రహ్లద’ ని అప్పట్లో 20 వేల రూపాయల తో నిర్మించారు.అప్పట్లోనే ఈ సినిమా లక్ష రూపాయల వరకు కలెక్ట్ చేసి ఇండీస్ట్రీ హిట్ గా నిలించింది.ఇప్పుడు మారుతున్న కాలం కి తగ్గట్లు సినిమా ల యొక్క అభిరుచి కూడా మారింది.92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర లో 40 వరకే ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అంటే ఏ రేంజ్ లో పోటీ అనేది ఉందొ తెలుస్తుంది.అయితే ఒక సినిమా అత్యధిక థియేటర్ ల లో ఎక్కువ రోజులు ప్రదర్శించ పడినా కూడా అది కేవలం సూపర్ హిట్ ,బ్లాక్ బస్టర్ హిట్ కింద కి వస్తుందే కానీ ఇండస్ట్రీ హిట్ కి రాదు.ప్రస్తుతం అదే చర్చనీయాంశం అయింది.

2003 లో రిలీజ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ ,రాజమౌళి ల సింహాద్రి సినిమా అప్పట్లో ఒక్క సంచలనం,జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి తర్వాత హిట్ రావడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేసాడు అంటే ఆ సినిమా ఏ స్థాయి లో హిట్ అయిందో తెలుస్తుంది.కానీ 2003 వరకు కూడా చిరంజీవి గారి ‘ఇంద్ర’ ఇండస్ట్రీ హిట్ గా ఉంది.2002 లో రిలీజ్ అయినా మెగాస్టార్ ఇంద్ర సినిమా నరసింహనాయుడు,ఖుషి ల కలెక్షన్ ల ని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.2003 లో వచ్చిన సింహాద్రి 50 డేస్ రన్ పరముగా ఇంద్ర ,ఖుషి లను క్రాస్ చేసినప్పటికీ కలెక్షన్ పరంగా చేయలేకపోయింది.175 డేస్ ల లో రికార్డు ను కూడా బద్దలు కొట్టింది.పూరి జగన్నాధ్ గారు డైరెక్ట్ చేసిన 2006 రిలీజ్ అయినా ‘పోకిరి ‘ అంతకు ముందు ఉన్న ఇంద్ర రికార్డు ల ను క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంటర్వ్యూ ల లో రాజమౌళి గారు మాట్లాడుతూ ‘మగధీర’ తో నాకు మొదటి ఇండస్ట్రీ లభించింది తర్వాత ప్రభాస్ ద్వారా వచ్చింది అని చెప్పారు.

ఎస్ ఎస్ రాజమౌళి కి 2009 లో రిలీజ్ అయినా మగధీర ద్వారా మొదటి ఇండస్ట్రీ హిట్ వస్తే మరి 2003 లో తనే డైరెక్ట్ చేసిన సింహాద్రి ఎలా ఇండస్ట్రీ అయింది అనేది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.సింహాద్రి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు మే 20 నా రీ రిలీజ్ అవుతున్న సింహాద్రి పోస్టర్ ల మీద ఇండస్ట్రీ హిట్ అని ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.బ్లాక్ బస్టర్ హిట్ అనో లేక జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అనో రాసుకోవడం వేరు కానీ అసలు ఇండస్ట్రీ హిట్ కానీ సినిమా ని కూడా ఇండస్ట్రీ హిట్ అని రాసుకోవడం ఏంటి అని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.1000 కోట్ల కి పైగా కలెక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ ఏ ఇండస్ట్రీ హిట్ కానప్పుడు సింహాద్రి ఎలా అవుతుంది అని అంటున్నారు.2017 లో రిలీజ్ అయినా ప్రభాస్ ,రాజమౌళి ల బాహుబలి 2 ఇప్పటికి వరకు టాలీవుడ్ లో ఉన్న చివరి ఇండస్ట్రీ హిట్.

634 views