Nagarjuna-Ram Charan: అక్కినేని నాగార్జున, రామ్ చరణ్ చేయాల్సిన ఆ సినిమా ఏదో తెలుసా?

Posted by venditeravaartha, June 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ ర్ సినిమాల హవా ఎప్పటి నుంచో ఉంది. అలనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తరువాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా రెండో తరం నటులు కూడా కలిసి ఒకే సినిమాల్లో నటించారు. లేటేస్టుగా మల్టీ స్టారర్ల సినిమాలు 25కు పైగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన మల్టీ స్టార్ సినిమాల్లో అన్నీ సక్సెస్ అయ్యాయని చెప్పలేం. అలా కాకుండా కొన్ని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరి కాంబినేషన్లు ముందుగా అనుకొని.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయినవీ ఉన్నాయి. వీటిలో ఇద్దరు స్టార్ల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం..

Nagarjuna-Akkineni-Ram-Charan-Konidela-News

మెగా కాంపౌండ్ హీరో రామ్ చరణ్ ప్రజెంట్ మంచి జోష్ లో ఉన్నారు. ఆయన లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ శంకర్ తీస్తున్న ‘గేమ్ చేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమూవీ సీరియస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో మాత్రమే మల్టీ స్టార్ సినిమా చేశారు. అయితే తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తో ఓ సినిమాలో నటించినా… వాటిల్లో మెయిన్ రోల్ మాత్రం చెర్రీనే హీరో అనుకోవచ్చు.

అయితే గతంలో రామ్ చరణ్ ఓ స్టార్ హీరోతో మల్టీస్టార్ మూవీ చేయాల్సి ఉండగా.. అది మిస్ అయింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున. చెర్రీ నటించిన ‘ధ్రువ’ మూవీ 2016లో రిలీజ్ అయిన విషయం తెలిసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ విడుదలకు ముందు ఎంతో ఎక్స్ పెక్టేషన్ ఉండేది. కానీ అనుకున్న విజయం సాధించలేకపోయింది. కానీ సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆదరించారనే చెప్పవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే తో పాటు సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

nagarjuna-and-ram-charan-combination-movie-missed

ఇక ఇందులో రామ్ చరణ్ ( Ram Charan )తో పాటు సమానంగా నటించిన మరో స్టార్ అరవింద స్వామి అని చెప్పవచ్చు. అరవింద స్వామి రోజా, బొంబాయి చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లు గుుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ‘ధ్రువ’ సినిమాలో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అరవింద స్వామి ప్లేసులో అక్కినేని నాగార్జునను అడిగారట. అయితే ముందుగా ఒఫ్పుకున్న ఆయన కొన్ని రోజుల తరువాత నో చెప్పాడట. దీంతో అరవింద స్వామిని విలన్ గా పెట్టారు. అయితే ఆయన కూడా తన యాక్టింగ్ తో ఇరగదీశారనే చెప్పొచ్చు. దీంతో అక్కినేని నాగార్జున ( Nagarjuna )తో చెర్రీ చేయాల్సిన ఆ సినిమా అలా మిస్ అయింది.

Tags :
1718 views