Trivikram: త్రివిక్రమ్ తర్వాత నాకు నచ్చిన డైరెక్టర్ అతనే:పవన్ కళ్యాణ్

Posted by venditeravaartha, July 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లు ,రాజకీయాల కి అతీతంగా తన కి ఉన్న అతి తక్కువ మంది సన్నిహితుల లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరు,మొదట ఇండస్ట్రీ కి డైలాగ్ రైటర్ ,రచయత గా వచ్చిన అతను ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమా తో డైరెక్టర్ గా అయ్యారు.ఇక టాలీవుడ్ స్టార్ హీరో లు అయినా పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ వంటి వారితో చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగారు.అయితే తన లో ఉన్న అతీతమైన దైవ మరియు పురాణాలూ సైన్స్ వంటి విషయాలకి సమాజం పట్ల తనకి ఉన్న బాధ్యత కి పవన్ కళ్యాణ్ గారు నచ్చి అయన తో స్నేహం అంతకు మించి గురువు స్థానం ఇచ్చిన విషయం తెలిసిందే.వీరి కలయిక లో వచ్చిన జల్సా తో వీరి మధ్య బంధం మరింత దృఢం గా అయింది.

trivikram

పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ ల మధ్య ఏర్పడిన స్నేహం కేవలం సినిమా ల వరకు కాకుండా తమ పర్సనల్ విషయాలు ,రాజకీయాల ల లో కూడా ఉంది అనే విషయం తెలిసిందే,పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు చేసిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వారి స్నేహం మీద ఎంతో మంది ఎన్నోనో ఆరోపణలు చేసిన వారి బంధం ఇంకా స్ట్రాంగ్ అయింది.ఇక తన రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్,బీమ్లా నాయక్ సినిమా ల లో త్రివిక్రమ్ గారి పాత్రా ఉంది..
తన మార్క్ స్క్రీన్ ప్లే ,మాటల తో ఈ రెండు సినిమా ల కి దగ్గర ఉంది త్రివిక్రమ్ గారే.ఇటీవల జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక్క సారి తాను నమ్మితే ఇక అంత వారి మీదనే వదిలేస్తాను .

pk and trivikram

విలక్షణ నటుడు గా పేరు తెచ్చుకున్న సముద్ర ఖని గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ,సాయి తేజ్ గారితో బ్రో మూవీ ని డైరెక్ట్ చేసారు.తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా వినోదయ సీతం ని మన తెలుగు లో కి రీమేక్ చేసారు.తమిళ నటుడు ,డైరెక్టర్ అయినా సముద్ర ఖని గారు పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకుని బ్లాక్ బస్టర్ సినిమా ని జులై 28 న మన ముందుకి తీసుకుని వస్తున్నారు.స్క్రిప్ట్ ,డైలాగ్ అన్నిటిని తెలుగు లో రాసుకుని మన తెలుగు ని స్పష్టం గా నేర్చుకుని తెలుగు వాళ్ళకంటే బెటర్ గా మాట్లాడే సముద్ర ఖని లో బాషా సాహిత్యం ,సినిమా మీద తన కి ఉన్న ఇష్టం తో నాకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు అని బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

pk and samdrakhani

715 views