Raju Yadav: ‘రాజు యాదవ్’ చిత్రానికి ఊహించని వసూళ్లు..5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే!

Posted by venditeravaartha, May 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Raju Yadav: బుల్లితెర ద్వారా పరిచయమై కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటులలో ఒకరు గెటప్ శ్రీను. జబర్దస్త్ ద్వారా అరిచయమైన గెటప్ శ్రీను ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. కమెడియన్ గా దూసుకుపోతూ టాలీవుడ్ లో అత్యంత బిజీ ఆర్టిస్టులలో ఒకరిగా మారిపోయాడు. ఈ ఏడాది లో విడుదలైన హనుమాన్ సినిమాతో గెటప్ శ్రీను కి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో మనమంతా చూసాము. ఇప్పుడు ఆయన తొలిసారిగా హీరోగా మారి చేసిన ‘రాజు యాదవ్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకరించిన ఈ సినిమా, విడుదల తర్వాత విన్నూతన ప్రయత్నం తో గెటప్ శ్రీను అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని టాక్ నడించింది. కేవలం కోటి 80 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం విడుదలై నేటితో 5 రోజులు పూర్తి అయ్యింది.

ఈ 5 రోజులకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజం ప్రాంతం లో 5 రోజులకు కలిపి 35 లక్షల రూపాయిలను వసూలు చేసింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో 45 లక్షల రూపాయిల షేర్, కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 10 లక్షల రూపాయిల షేర్, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 90 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఏకైక సినిమా కావడం తో ఈ వీకెండ్ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

అదే కనుక జరిగితే గెటప్ శ్రీను కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే అనుకోవాలి. ఇతనితో పాటుగా జబర్దస్త్ షో లో ఒకే టీం లో కొనసాగిన సుడిగాలి సుధీర్ రీసెంట్ గానే హీరోగా మారి గాలోడు సినిమాతో మొట్టమొదటి సక్సెస్ అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు గెటప్ శ్రీను కూడా సక్సెస్ అందుకోవడం విశేషం. అయితే సుధీర్ కామెడీ పాత్రలకు దూరమై కేవలం హీరోగా మాత్రమే రాణించాలని చూస్తుంటే, గెటప్ శ్రీను మాత్రం కేవలం కమెడియన్ గా మాత్రమే స్థిరపడాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా జరిగిన అనేక ఇంటర్వూస్ లో కూడా ఆయన ఇదే చెప్పాడు. మరి చెప్పిన మాట మీద శ్రీను నిలబడుతాడో లేదో చూడాలి.

272 views