Amani: టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమని సంచలనమైన వాక్యాలు

Posted by venditeravaartha, February 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆమెని ఒకప్పటి స్టార్ హీరోయిన్ తాను ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే విధంగా ఉండేది తన నటన చూసి డైరెక్టర్స్ కూడా వరుస అవకాశాలు కల్పించారు ఆమని సినిమాల్లో నటించడం వాళ్ల నాన్న గారికి నచ్చకపోయినా ఆయనను ఒప్పించి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట ఎన్ని ఆడిషన్స్ కి వెళ్లిన ఫలితాలు లేకపోయేది తరువాత తాను మొదటిగా తమిళ సినిమాలో నటించింది. తను తెలుగు లో నటించిన మొదటి సినిమా మాత్రం జంబలకడిపంబ ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమని కి వరస అవకాశాలు వచ్చాయి వరుసగా షూటింగ్ గ్యాప్ కూడా లేకుండా సినిమాలు వరుసగా చేశారు దాదాపు అగ్ర హీరోస్ అందరితో నటించారు కానీ తాను అభిమానించే చిరంజీవి గారితో మాత్రం తనకు అవకాశం దక్కలేదు. రాజేంద్రప్రసాద్ కి జంటగా నటించినా మిస్టర్ పెళ్ళాం చిత్రం కి నంది అవార్డు లభించింది. శుభలగ్నం సినిమా కు గాను ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇలా తాను చేసిన సినిమాలలో చాలావరకు సక్సెస్ అయినా సినిమాలే కావున తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

ఆమని గారు హీరోయిన్ గా దాదాపు 50 కి పైగా సినిమాల్లో నటించారు అయితే ఇండస్ట్రీ కి వెళ్లడం అనేది ఆషామాషీ విషయం కాదని ఎన్నో వడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ విషయం ఇండస్ట్రీ కి వెళ్లిన తర్వాతే తెలిసిందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పటం జరిగింది. తనని ఒంటరిగా రమ్మని అడిగేవారని చెప్పుకొచ్చింది తన విషయం అనే కాకుండా ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబడాలి అంటే ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయి అని చెప్పుకొచ్చారు. ఆమని గారు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు వివాహం అయినా తర్వాత ఆమె భర్త కి హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోవడంతో కొన్నాళ్ళు ఎక్కడ కనిపించలేదు ఫ్యామిలీతో మాత్రమే గడిపారు తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం తల్లిగా మరియు కొన్ని ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు ఇప్పటివరకు ఆమె చేసిన మొత్తం సినిమా లు దాదాపుగా 100 కు పైగా ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా ఆమని గారు కనిపిస్తున్నారు. తాను ఏ రోజు డబ్బు కోసం పని చేయలేదని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి, నటిగా గుర్తింపు రావడం కోసమే ప్రయత్నిస్తూ వచ్చానని చెప్పుకొచ్చారు.

Tags :
1413 views