Akkineni family: అక్కినేని హీరోలు ‘జీరో’ ఐపోవడానికి కారణం అదేనా..మరో మంచు ఫ్యామిలీ కాబోతుందా?

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సాధారణం గా ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ముఖ్యం గా ఉండాలసింది మంచి కథ ,యాక్టర్ లు ఆ సినిమా కథ ని కరెక్ట్ గా తీయగలిగే డైరెక్టర్ ,కానీ కొన్ని సినిమా లు పైన చెప్పినవి ఏమి లేకపోయినప్పటికీ హిట్లు అవుతుంటాయి దానికి కారణం ఆ టైం లో ఉన్న పరిస్థితులు ఉదాహరణకి పండగల సీజన్లో రిలీజ్ చేయడం ,ఆ సినిమా కి పోటీ లేకపోవడం వంటి కొన్ని కారణాలు ఉండొచ్చు.కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కారణం సిల్లీ గా అనిపించవచ్చు కానీ ఇది కూడా సినిమా సక్సెస్ కి కారణం అవుతుంది అనే చెప్పాలి.అదే సినిమా టైటిల్.జనాల్ని థియేటర్ దగ్గర కి తీసుకుని రావడానికి ముఖ్య కారణం సినిమా టైటిల్.

మరి అప్పట్లో మన తెలుగు సినిమా నుంచి సంప్రదాయమైన టైటిల్ లు వచ్చేవి మారుతున్న కాలానికి తగ్గట్లు గా సినిమా టైటిల్ కూడా మారిపోతున్నాయి,మరి ఈ మార్పు అందరి హీరోల మీద పడుతుందా అంటే అలా లేదు..కేవలం అక్కినేని ఫ్యామిలీ హీరో ల కి ఈ మధ్య కాలం లో రిలీజ్ అయినా కొన్ని టైటిల్స్ వలన సినిమా ను డిసాస్టర్ లు అవుతున్నాయి అనేది కొందరి వాదన.అప్పట్లో మన సినిమా టైటిల్ పెద్దవి గా ఉన్నపటికీ కూడా అందరికి నచ్చేవి ,జనాలని థియేటర్ వద్దకు రప్పించేవి ఉదాహరణకు ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’,’ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ వంటి సినిమా లు మంచిగానే రిజిస్టర్ అయ్యాయి సూపర్ హిట్లు అయ్యాయి.

గత కొంత కాలం నుంచి అక్కినేని హీరో ల నుంచి రిలీజ్ అయినా సినిమా టైటిల్స్ ని పరిశీలిస్తే నాగార్జున(Nagarjuna) గారి ‘వైల్డ్ డాగ్’,’ఆఫీసర్’,’ది ఘోస్ట్’ సినిమా లు ఇంగ్లీష్ టైటిల్స్ ఈ మూడు సినిమా లు డిజాస్టర్ లు గా నిలిచాయి,అలానే చైతన్య(Naga chaitanya) గారి ‘థాంక్ యు’,’కస్టడీ’ సినిమా లు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ ఏ అలానే అక్కినేని అఖిల్(Akhil) నటించిన ‘ఏజెంట్ ‘,’హలో’ ,మిస్టర్ మజ్ను’ వంటి సినిమా లు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ ఏ ఇవి కూడా నిరాశపర్చాయి.అయితే అలా అని కేవలం ఇంగ్లీష్ టైటిల్ ల వలెనే సినిమా లు ప్లాప్ అవుతున్నాయా అంటే అలా అనుకునే దానికి లేదు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’,బాలకృష్ణ గారి ‘లెజెండ్’,రజనీకాంత్ ‘రోబో’ సినిమా లు ఇంగ్లీష్ టైటిల్స్ అయినా సక్సెస్ అయ్యాయి.మంచి కథ తో పాటు గా టైటిల్ కూడా మంచిగా ఉంటె సినిమా కి ఉపయోగపడుతుంది అని ఉద్దేశం.ఇక నైనా మంచి స్టోరీ ల తో వచ్చి హిట్ కొడతారు ఏమో చూడాలి అక్కినేని హీరో లు.

6220 views