పెళ్లి తర్వాత మాజీ లవర్ ని తలచుకున్న హన్సిక

Posted by venditeravaartha, February 23, 2023

తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక. తెలుగు లోనే కాకుండా తమిళ కన్నడలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో అల్లు అర్జున్ తో జోడి కట్టి దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమానే సక్సెస్ సాధించడంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది తరువాత హన్సికాకు వరుస సినిమాలో అవకాశాలు వచ్చాయి అందంతో పాటు నటనలతో కూడా మెప్పించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తోడు అవసరం అలాగే ప్రేమలో పడడం కూడా సహజమే హన్సిక ఇన్నాళ్ళుగా బయట పెట్టని తన ప్రేమ వ్యవహారం గురించి ప్రేక్షకులతో పంచుకుంది. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పుకోలేదు ఇండస్ట్రీలో ఉన్న వారికి ఇటువంటి ప్రేమ విషయాలు కామన్ ఏ హన్సిక ఎవరిని అంత తొందరగా నమ్మను అని ప్రేమలో ఓడిపోయాను నా ప్రేమ తరుపున జ్ఞాపకాలు మర్చిపోవడానికి నాకు 8 ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చింది.

ఇది ఇలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 4న తన బాల్య మిత్రుడు అయినా సోహెల్ కాతూరియా తో పెళ్లి జరిగింది. ఎవరైనా పెళ్లికి ముందు ఇటువంటి వాటిపై స్పందిస్తారు కానీ హన్సిక మాత్రం పెళ్లయిన మూడు నెలల తర్వాత తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి అందరితో పంచుకుంది బ్రేకప్ అయిన తర్వాత పెళ్లికి సిద్ధం అవ్వడానికి చాలా సమయం పట్టిందని తన అనుభవాలు పంచుకుంది అయితే తన ప్రేమ వ్యవహారం హీరో శంభూతో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే శంబుతో నయనతర రిలేషన్ కూడా మనకు తెలిసింది తర్వాత హన్సిక త్రిష ఇలా అందరితోనే తన ప్రేమ వ్యవహారాలు నడపడం మనకు తెలిసిన విషయమే ప్రస్తుతం హన్సిక తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.

Tags :
49 views