టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు ఉన్న వారు పూరి జగన్నాధ్ ..అయన తన సినిమా ల లో హీరో ల ను చూపించే స్టైల్ కి సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో బద్రి సినిమా తో డైరెక్టర్ తన ప్రస్థానం మొదలు పెట్టిన పూరి
తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడు.ఇక ఆ తర్వాత రవితేజ గారితో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ,ఇడియట్ ,అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి వంటి సినిమా ల తో స్టార్ డైరెక్టర్ గా మారిన పూరీజగన్..మహేష్ బాబు గారితో చేసిన పోకిరి సినిమా తో ఇండస్ట్రీ హిట్ సాధించారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ తర్వాత సరైన హిట్లు లేక సతమత అవుతున్న పూరి కి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ బ్లాక్ బస్టర్ ని అందుకుని తన రెండవ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసారు అనే చెప్పాలి.
పూరి,ఛార్మి కౌర్ కలిసి రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరి కి సక్సెస్ రిటర్న్ వచ్చింది.అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆ స్థాయి లో సక్సెస్ లో పూరి గారి పాత్ర ఎంత అయితే ఉందొ అలానే హీరో రామ్ పాత్రా కూడా అంతే ఉంది.2019 లో రిలీజ్ అయినా ఈ సినిమా రామ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమా గా రికార్డు ని సృష్టించింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్ కానీ అలానే డైరెక్టర్ పూరి కి సరైన సక్సెస్ అయితే రాలేదు
వీరి కలయిక లో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ అంటూ సినిమా ని స్టార్ట్ చేసారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ ప్రధాన పాత్రా పోషించిన విషయం తెలిసిందే
ఈ సినిమా లోని పాటలు మిలియన్ వ్యూస్ ల తో యూట్యూబ్ లో రికార్డు లను కొట్టాయి..ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరో లెవెల్ అని చెప్పొచ్చు.మణిశర్మ గారు ఇచ్చిన చిలక చిలక సాంగ్ అయితే మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని సాధించాయి.ఈ సినిమా తర్వాత
మణిశర్మ గారికి తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆచార్య సినిమా ఛాన్స్ కూడా వచ్చింది
ఆ స్థాయి లో ప్రభావితం చేసిన మణిశర్మ గారి మ్యూజిక్ డబల్ ఇస్మార్ట్ కి లేకపోవడం సినిమా కి మైనస్ గా మారే అవకాశం ఉంది అంటున్నారు.ఈ సినిమా కోసం పూరి గారు అనూప్ రూబెన్స్ ని తీసుకున్నట్లు సమాచారం.