Bandla Ganesh: బండ్ల గణేష్ కి ఏమైంది ? తన దేవుడి మీద కామెంట్ చేయడానికి అతనే కారణమా ?

Posted by venditeravaartha, June 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బండ్ల గణేష్(Ganesh) ఈ పేరు వినగానే మొదటగా గుర్తు వచ్చేది పవన్ కళ్యాణ్..ఈశ్వర పవనేశ్వర అంటూ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో గణేష్ మాట్లాడిన స్పీచ్ కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే బండ్ల గణేష్ మాటలకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుస్తుంది.ఇండస్ట్రీ లో కి మొదట అసిస్టెంట్ మేనేజర్ గా ఆ తర్వాత కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్,ఆంజనేయులు సినిమా తో ప్రొడ్యూసర్ గా మారాడు..తన రెండవ సినిమా తీన్ మార్ తో డిజాస్టర్ అందుకున్నప్పటికీ గబ్బర్ సింగ్ తో మెగా ప్రొడ్యూసర్ గా మారాడు బండ్ల గణేష్.

ganesh

బండ్ల గణేష్ కి ఇండస్ట్రీ లో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పుకునే ఇతను తన ప్రాబ్లెమ్ మరియు ఫ్యామిలీ కి సంబంధిచిన విషయాలను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో షేర్ చేసుకుంటాను అని చాల ఇంటర్వ్యూ ల లో చెప్పారు.తీన్ మార్ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చేయడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) అని చాల సార్లు అన్నారు..తనకి ఉన్న ఒకే ఒక వెల్ విషేర్ తానే అంటాడు.కాకపోతే గత కొంత కాలంగా బండ్ల గణేష్ తెలంగాణ పాలిటిక్స్ లో అడుగు పెట్టి విఫలం చెంది మరల సినిమా ల లో నటిస్తూ నటుడు గా కొనసాగుతున్నాడు

bandla ganesh

పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ హాజరు అయ్యి స్టేజి మీద పవన్ కళ్యాణ్ స్పీచ్ కి క్లాప్స్ కొట్టి ఆ తర్వాత ఆయన మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు సినిమా లు చేస్తూ రాజకీయాలు చేయాలి అని అన్నారు.ఇక తన తదుపరి చిత్రం అయినా బీమ్లా నాయక్ ఫంక్షన్ కి తనకి ఇన్విటేషన్ రాలేదు అని త్రివిక్రమ్ మీద కొన్ని మాటలు మాట్లాడిన గణేష్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ల లో తాను కావాలనే మాట్లాడాను అని కోపం తో అలా అన్నాను అని ఒప్పుకున్నాడు.ఇక మొన్న ఈ మధ్య తన ట్విట్టర్ అకౌంట్ నుంచి గురూజీ అంటూ వ్యంగ్యముగా ట్విట్ లు చేసాడు.ఇక అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ డైరెక్ట్ గా ట్విట్ లు చేసాడు.

ganesh

పవన్ కళ్యాణ్ గారు తనకి దైవం తో సమానం అని చెప్తూ వచ్చిన బండ్ల గణేష్..ఇప్పుడు ఆయన మీద ఆయన కి వెల్ విషేర్ అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చేస్తున్న వ్యాఖ్యల వెనుక కొంత మంది రాజకీయా నాయకులూ ఉన్నారు అని టాక్ ఉంది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లో అడుగు పెట్టాను అని చెప్పిన బండ్ల గణేష్ త్వరలోనే వైస్సార్సీపీ పార్టీ లో చేరబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి అందుకోసమే ముందుగా పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు కావాలనే చేస్తున్నారు అంటూ మరికొందరు అంటున్నారు.

 

643 views