VIRUPAKSHA:కలెక్షన్ ల సునామి గా విరూపాక్ష ! రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్న కలెక్షన్స్.

Posted by venditeravaartha, May 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ,సంయుక్త మీనన్ నటించిన స్పిన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష రోజు రోజు కి ఒక్కో రికార్డు ను బ్రేక్ చేస్తుంది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో తెలుగు రాష్ట్ర ల లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సినిమా మే 5 నా హిందీ ,మలయాళం ,తమిళ్ భాష ల లోను రిలీజ్ అయింది.అయితే తెలుగు లో వచ్చినంత టాక్ రాకపోయినప్పటికీ ఓ మాదిరి కలెక్షన్ ల తో నడుస్తోంది.రిలీజ్ అయినా 17 వ రోజు కూడా సూపర్బ్ కలెక్షన్ ల తో విరూపాక్ష దూసుకుని పోతుంది.

విలక్షణ కథ ,కథనాలు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిసి నటి నటుల అభినయం తో విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయింది.సాయి తేజ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అంతే స్థాయి లో బిజినెస్ జరుపుకుంది.ప్రపంచ వ్యాప్తం గా 22 కోట్ల బిజినెస్ జరిగిన సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయింది.అయితే రికార్డు స్థాయి లో ఇప్పటి వరకు 45 కోట్ల కలెక్షన్ సాధించి 23 కోట్ల ప్రాఫిట్ సాధించింది.మే 7 ఆదివారం రోజున తెలుగు రాష్ట్ర ల లో దాదాపు 85 లక్షల షేర్ సాధించింది అంటే మాములు విషయం కాదు.

విరూపాక్ష వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్:
ఆంధ్ర ,తెలంగాణ :35 .82 కోట్లు
ఓవర్సీస్:5 .41 కోట్లు
KA +ROI :3 .37 కోట్లు
టోటల్ :44 .60 కోట్లు(షేర్)(87 .50 కోట్ల గ్రాస్ )
మరో 12 .50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే సాయి తేజ్ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా గా విరూపాక్ష గా రికార్డు ల లో ఉంటుంది.

634 views