Varun – Lawanya:పెళ్ళైన 10 రోజులకే వరుణ్ తేజ్ షాకింగ్ నిర్ణయం..పాపం లావణ్య పరిస్థితి ఇలా అయిపోయిందేంటి!

Posted by venditeravaartha, November 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Varun – Lawanya: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ జంట కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటలీలో డెస్టిసేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లికి పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ఇక వీరి వివాహ విందు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విష్ చేశారు. దీంతో దాదాపు ఐదేళ్ల వీళ్ల ప్రేమాయణానికి శుభం కార్డు పడింది.

లొట్టచెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.. తన క్యూట్‌నెస్‌ నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో రిలేషన్‌లో ఉండి.. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. నవంబరు 5 న హైదరాబాదులో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే వీరికి పెళ్లై సరిగ్గా పది రోజులు కూడా కాలేదు. అప్పుడే వరుణ్ తేజ్ తన భార్య లావణ్యకు షాక్ ఇచ్చాడు. ఆప్పుడే ఆమెను వదిలేశాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవును ఇది నిజం.

అసలేమైందంటే.. లావణ్యను వదిలిపెట్టి వర్క్ బిజీలో పడిపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి మట్కా, మరొకటి ఆపరేషన్ వాలైంటైన్. ఆ రెండింటిలో ఆపరేషన్ వాటెంటైన్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ఈ సినిమాను కొన్ని వాస్తవిక సంఘటన స్ఫూర్తితో తెలుగు, హిందీ భాషల్లో బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ పైలెట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ ముంబైలో జరుగుతోంది. దీని కోసం వరుణ్ ముంబయికి వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇది చూసిన కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని కొత్త భార్యతో హనీమూన్ కు వెళ్లాల్సిన వరుణ్ ఇలా సినిమాల షూటింగ్ లో పడిపోయాడేంటి.. భార్య కంటే సినిమాలే ఎక్కువనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1707 views