Varun Tej-Lavanya: వరుణ్ తేజ్ ,లావణ్య ల పెళ్లి ముహూర్తం ఫిక్స్ !

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వస్తున్న రూమర్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ నడుస్తుంది అని వారు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు అని తెగ వైరల్ అయ్యాయి.అయితే వీటికి చెక్ పెడుతూ వరుణ్ తేజ్ నాన్న అయినా నాగబాబు గారు ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.తనకి నచ్చిన అమ్మాయితోనే వరుణ్ బాబు పెళ్లి ఉంటుంది అని అది సినిమా ఇండస్ట్రీ నుంచి అయినా లేక బయట వాళ్ళు అయినా అని చెప్పడం తో అందరికి ఒక క్లారిటీ వచ్చింది.అయితే ఇదే విషయాన్ని కంఫర్మ్ చేస్తూ ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.

lavanya varun

ముకుంద సినిమా ద్వారా తెలుగు సినిమా కి పరిచయం అయినా వరుణ్ తేజ ఆ తర్వాత తాను విభిన్నమైన కథాంశాల తో సినిమా లు చేసి సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చుకున్నారు..ఇక శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ సినిమా లో హీరోయిన్ గా చేసిన లావణ్య త్రిపాఠి(Lavanya) తో మంచి స్నేహం ఏర్పరుచుకున్న వరుణ్ తేజ ,ఆ స్నేహం ని ప్రేమగా మార్చుకున్నారు.వీరి కలయిక లో వచ్చిన మరో చిత్రం ‘అంతరిక్షం’ సమయానికి వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి.అయితే అప్పుడు వీరు ఎవరు రెస్పాండ్ కాకపోవడం తో మీడియా కూడా ఈ విషయాన్ని ఇంకా ముందుకి తీసుకుని పోలేదు కానీ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సమయం లో లావణ్య రాజస్థాన్ వెళ్లడం అక్కడ వరుణ్ తో సన్నిహితంగా ఉండటం తో వీరి ప్రేమ ని కంఫర్మ్ చేసారు.

varun loves lavanya

ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ల పెళ్లి కి వీరి కుటుంబాలు ఓకే చెప్పడం తో జూన్ 9 న హైదరాబాద్ లో నిచ్చితార్ధం జరగనుంది.ఈ వేడుక కి మెగా,అల్లు ఫ్యామిలీ ల తో పాటు లావణ్య త్రిపాఠి బంధువులు మరియు దగ్గరి స్నేహితులు హాజరు కానున్నారు అని సమాచారం.ఇక ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది.మెగా ఫ్యామిలీ నుంచి త్వరలోనే శుభవార్త రానుండటం తో మెగా ఫాన్స్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు.

878 views