Sree leela: శ్రీలీల తల్లిపై ట్రోలింగ్.. ఏం జరిగిందంటే?

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న ట్రెండ్ హీరోయిన్లలో శ్రీలీల(Sree leela) ఒకరు. మొన్నటి వరకు రష్మిక, కృతి శెట్టి లాంటి హీరోయిన్ల హవా సాగాగా.. ఇప్పుడు శ్రీలీల అంటూ కలవరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో 12 సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఏమాత్రం తీరిక లేకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాకు ఈ భామ సైన్ చేసుకుంటూ పోతుంది. నందమూరి బాలకృష్ణ సినిమాలోనూ శ్రీలీల నటించడం విశేషం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సీనియర్ హీరోల మధ్య నటించడం కష్టమే అన్నవాళ్ల నోళ్లూ మూయించడానికి శ్రీలీల తెగ కష్టపడిపోతుందట. ఈ తరుణంలో శ్రీలీల తల్లిపై ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

sreeleela

రాఘవేంద్ర రావు డైరెక్షన్లో ఏ హీరోయిన్ అయినా స్టార్ గా మారాల్సిందే. అలా చాలా మంది ఆయన చేతి నుంచి వచ్చిన హీరోయిన్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. పెళ్లిసందD(Pellisandhadi) అనే మూవీ ద్వారా తెరంగేట్రం చేసిన శ్రీలీల ఫస్ట్ మూవీతోనే అందరికీ పరిచయం అయింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్టు కాకపోవడంతో శ్రీలీలకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తరువాత రవితేజతో ‘ధమాకా’(Dhamaka)లో నటించి ఆకట్టుకుంది. ఇందులో పాటలకు శ్రీలీల వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. కుర్రాళ్లకు సైతం షాక్ ఇచ్చేలా ఆమె డ్యాన్స్ ఉండడంతో ఆమెకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.

dhamaka

ఇదే సమయంలో శ్రీలీలకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె బాలయ్య సినిమాతో పాటు పవన్ కల్యాన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని లాంటి హీరోల పక్కన నటిస్తోంది. శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె చిన్నపిల్లలా ఉందని స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం రాకపోవచ్చని అందరూ అన్నారు. కానీ వారి కామెంట్లకు చెక్ పెట్టేలా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ram sreeleea

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ శ్రీలీల బిజీగా మారుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ పిక్స్ పెడుతూ అందరికీ ఆకట్టుకుంటోంది. అయితే అంతకుముందు ఓ విషయం చెప్పాలి. శ్రీలీల నటించే సినిమాల్లో గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండా ఉండాలని నిర్ణయించుకుందట. ఎక్కడా బ్యాడ్ సీన్స్ చేయకుండా కేవలం మంచి పాత్రల్లోనే నటించాలని అనుకుందట. ఎందుకంటే అలా నటిస్తే సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తారని, వాటిని తట్టుకునే శక్తి లేదని శ్రీలీల అనుకుంటుందట. ఒకవేళ అలా నటిస్తే తన తల్లి కూడా అలా నటించిందా? అని అంటారని శ్రీలీల ముందే డిసైడ్ అయిందట. శ్రీలీల అనుకున్న ఈ విషయాన్ని కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.

1637 views