TOLLYWOOD:గత 20 సంవత్సరాల లో రిలీజ్ అయినా టాప్ 10 టాలీవుడ్ బెస్ట్ డెబ్యూ మూవీస్

Posted by venditeravaartha, April 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినీ పరిశ్రమ లో పెద్ద హీరో గా ఎదగాలి అంటే ఆ హీరో కి ఉండాల్సిన మొదటి లక్షణం మంచి కథ ని ఎంచుకోవడం ,దానికి సరిపడే డైరెక్టర్ తో పని చేయడం,కొంత మంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ల లోకి వచ్చిన తర్వాత కథల ఎంపిక లో సరైన జాగ్రత్త లేక సక్సెస్ కాలేక పోయిన వారు చాల మంది ఉన్నారు.తమ మొదటి సినిమా తో నే బ్లాక్ బస్టర్ సాధించిన వారు ఎవరో చూద్దాం ,గడిచిన 20 సంవత్సరాల లో వచ్చిన బెస్ట్ డెబ్యూ మూవీస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ,మేము ఇచ్చిన జాబితా లో ఏమైనా మిస్ అయితే కింద మెన్షన్ చేయండి.

దేవదాసు:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ,ఇలియానా కాంబినేషన్ లో వై వి ఎస్ చౌదరి గారి డైరెక్షన్ లో 2006 లో రిలీజ్ అయినా దేవదాసు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది,బెస్ట్ డెబ్యూ హీరో గా రామ్ కి ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

చిరుత:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 2007 లో రిలీజ్ అయినా ‘చిరుత’ సెన్సషనల్ మ్యూజికల్ హిట్ గా నిలిచి ,అప్పటి వరకు ఉన్న డెబ్యూ హీరో లా అన్ని సినిమా ల రికార్డు ల ను బ్రేక్ చేసింది,2021 లో రిలీజ్ అయినా ఉప్పెన వరకు కూడా చిరుత నే బెస్ట్ డెబ్యూ ఫిలిం గా ఉన్నదీ.చరణ్ కి ఈ సినిమా కి 2007 కి ఫిలింఫేర్ ,నంది స్పెషల్ జ్యురి అవార్డు లభించాయి.

అష్ట చమ్మ:న్యాచురల్ స్టార్ నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ హీరో గా పరిచయం అయినా సినిమా ‘అష్ట చమ్మ’,అష్టా చమ్మా 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు రచయిత, దర్శకుడు. ఈ సినిమా ద్వారా స్వాతి కి
ఫిలిం ఫేర్ ,నంది అవార్డు లు లభించాయి.

లీడర్:లీడర్ 2010 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. నిర్మాత డా.డి. రామానాయుడు మనుమడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు దగ్గుబాటి రానా ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయం అయ్యాడు. రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ కథ నడుస్తుంది.ఇప్పటికి ఈ సినిమా ఒక క్లాసిక్.

ఉయ్యాలా జంపాల:షార్ట్ ఫిలిం ల ద్వారా వచ్చిన గుర్తింపు తో రాజ్ తరుణ్ హీరో గా పరిచయం అయినా సినిమా ‘ఉయ్యాలా జంపాల’ ,ఈ సినిమా లో హీరోయిన్ గా అవికా గోర్ నటించారు.హీరో నాగార్జున నిర్మాత గా వ్యవహరించారు,ఈ సినిమా కి గాను రాజ్ తరుణ్ ,అవికా ల కి బెస్ట్ డెబ్యూ గా ఫిలిం ఫేర్ అవార్డు లు లభించాయి.

ఊహలు గుసగుసలాడే:ఊహలు గుసగుసలాడే 2014 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా.టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ద్వారా నాగసౌర్య సోలో హీరో గా కనిపించారు,రాశిఖన్నా కి ఇదే డెబ్యూ మూవీ.

పెళ్లి చూపులు: 2016 లో విజయ్ దేవరకొండ సోలో హీరో గా ,రీతూ వర్మ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్ రచన మరియు దర్శకత్వం వహించిన చిత్రం పెళ్లి చూపులు, మరియు రాజ్ కందుకూరి మరియు యష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చలనచిత్రం మరియు ఉత్తమ స్క్రీన్‌ప్లే కోసం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఉత్తమ చలనచిత్రం మరియు ఉత్తమ నటిగా రెండు రాష్ట్ర నంది అవార్డులు మరియు ఉత్తమ తెలుగు చిత్రంతో సహా రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకుంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: నవీన్ పోలిశెట్టి హీరో గా తన ఫ్రెండ్స్ అందరు కలిసి తీసిన థ్రిల్లర్ సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’,ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ 2019 జూన్ 21 న విడుదలైన కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా.నెల్లూరు కు చెందిన ఒక నేర పరిశోధకుడి నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కలర్ ఫోటో:కలర్ ఫోటో 2020, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసారిగా హీరో
గా నటించిన ఈ చిత్రం , 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది. 2020, అక్టోబరు 23న ఈ చిత్రం ఆహా లో విడుదలయింది.ఈ సినిమా కి జాతీయ అవార్డు లభించింది.

ఉప్పెన:ఉప్పెన 2021 లో విడుదలైన తెలుగు సినిమా. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా పంజా వైష్ణవ్ తేజ్ పరిచయమయ్యారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.ఉప్పెన బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా బెస్ట్ డెబ్యూ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డు బద్దలు కొట్టింది.

564 views