TOLLYWOOD:టాలీవుడ్ లో సత్తా చాటిన టాప్ 5 తమిళ స్టార్ డైరెక్టర్ లు ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, April 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ ఉంటె ఏ భాష వారు అయినా నటించ వచ్చు ,డైరెక్ట్ చేయొచ్చు ,సంగీతం అందించ వచ్చు,కానీ ప్రాంతీయ భాష లో ప్రావీణ్యం పొందిన కొంత మంది హీరో లు వేరే భాష లో అంతే ప్రాచుర్యం పొందిన వారు చాల మంది ఉన్నారు,
కానీ దర్శకులు మాత్రం వారి మాతృ భాష లోనే ఎక్కువ గుర్తింపు ,స్టార్ డాం తెచ్చుకుంటున్నారు,కానీ కొంత మంది దర్శకులు మాత్రం వారి మాతృ భాష లో ఎంత స్టార్ డాం తెచుకున్నారో ,వేరే భాష సినిమా లోను అంతే గుర్తింపు పొందారు ,వారి లో ఎక్కువ పాపులారిటీ ,సక్సెస్ కలిగిన డైరెక్టర్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

భారతీ రాజా:సీతాకోక చిలుక సినిమా తో తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భారతీ రాజా,తర్వాత కాలం లో తీసిన యువతరం పిలిచింది ,ఆరాధనా,జమదగ్ని సినిమా ల తో తెలుగు లో సూపర్ హిట్ సినిమా ల కి డైరెక్షన్ చేసారు.

కె. బాల చందర్:కమలహాసన్ గారి గురువు గారు అయినా లెజెండరీ డైరెక్టర్ బాలచందర్,తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న కాలం లో తెలుగు లో డైరెక్ట్ గా తీసిన సినిమా లు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి అంటే అయన రేంజ్ తెలుగు ఇండస్ట్రీ లో ఏంటో తెలుస్తుంది.
భలే కోడలు తో తెలుగు లో మొదటి సినిమా చేసిన ఈయన తర్వాత సత్తె కాలపు సత్తెయ్య,బొమ్మా బొరుసా,ఆకలి రాజ్యం,అంతులేని కథ,మరో చరిత్ర,అందమైన అనుభవం,తొలి కోడి కూసింది,47 రోజులు,కోకిలమ్మ,రుద్రవీణ లాంటి క్లాసిక్ లు అందించారు.

కె.ఎస్. రవి కుమార్:మెగా స్టార్ చిరంజీవి గారి స్నేహం కోసం సినిమా తో తెలుగు లో మొదటి సినిమా డైరెక్ట్ చేసిన రవి కుమార్ గారు ,బావ నచ్చాడు,విలన్,జై సింహా,రూలర్ సినిమా ల తో తెలుగు లో తన సత్తా చాటారు.

ఎ. కరుణాకరన్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలి ప్రేమ ‘ తో తెలుగు సినిమా కి పరిచయం అయినా కరుణాకరన్ ,తెలుగు లో సక్సెస్ అయినా తమిళ డైరెక్టర్ ల లో బాలచందర్ గారి తరవాత ఉంటారు,ఈయన తీసిన యువకుడు,వాసు,బాలు,హ్యాపీ,ఉల్లాసంగా ఉత్సాహంగా,డార్లింగ్,ఎందుకంటే ప్రేమంట,చిన్నదాన నీకోసం,తేజ్ – ఐ లవ్ యూ లాంటి సినిమా లు తెలుగు ప్రేక్షకులని బాగా అలరించాయి.

ఎస్.జె. సూర్య: పవర్ స్టార్ అల్ టైం బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ సినిమా తో తెలుగు లో అడుగు పెట్టిన ఎస్ .జె,సూర్య గారు తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో ‘నాని’,పవన్ కళ్యాణ్ గారి తో పులి సినిమా ల తో ఆకట్టుకున్నారు.

392 views