Chiranjeevi: మెగాస్టార్ తో టిల్లు! క్రేజీ కాంబినేషన్.

Posted by venditeravaartha, June 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారు తన కం బ్యాక్ తర్వాత చేసిన సినిమా ల లో ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కాగా ఆ తర్వాత రిలీజ్ అయినా సైరా,ఆచార్య ,గాడ్ ఫాదర్ నిరాశపరచడం తో మెగా ఫ్యాన్స్ నిరాశకి లోనయ్యారు.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ అయినా వాల్తేర్ వీరయ్య తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని సాధించి 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు.తన తదుపరి చిత్రం గా తమిళ్ లో సూపర్ హిట్ అయినా వేదలమ్ ని భోళాశంకర్ గా రీమేక్ చేస్తున్నారు.వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత తాను ఇంకా రీమేక్ సినిమా లు చేయను అని చెప్పిన చిరంజీవి..మరో రీమేక్ సినిమా ని చేయబోతున్నారు అనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

chiru kalyan krishna

చిరంజీవి గారి కుమార్తె సుస్మిత ప్రొడ్యూసర్ గా మారి కళ్యాణ్ కృష్ణ (Kalyan krishna)డైరెక్షన్ లో చిరంజీవి గారి తో ఒక సినిమా ని ప్లాన్ చేసారు.ఈ సినిమా లో చిరంజీవి గారి తో యంగ్ హీరో అయినా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu) నటించనున్నారు అనే టాక్ ఉంది.మలయాళ సూపర్ హిట్ అయినా బ్రో డాడీ సినిమా ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు అని అందులో తండ్రి ,కొడుకుల లాగా చిరంజీవి గారు ,సిద్దు చేస్తున్నారు అని సమాచారం.అయితే చిరంజీవి గారు తాను రీమేక్ లు చేయను అని చెప్పడం తో ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే మూవీ ఉండబోతుంది అని అంటున్నారు.

bro daday

రవితేజ కి బ్లాక్ బస్టర్ అయినా ధమాకా సినిమా కథ రైటర్ అయినా బెజవాడ ప్రసన్న కుమార్ గారు ఒక కమర్షియల్ స్క్రిప్ట్ ని సుస్మిత గారికి వినిపించడం తో ఆ స్క్రిప్ నచ్చడం తో తాను ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి ఆ కథ ని లాక్ చేసారు సుస్మిత.ఇప్పుడు ఆ కథ ని చిరంజీవి ,సిద్దు ల తో చేయనున్నారు.ఈ సినిమా కి డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ నే చేయనున్నారు
ఈ సంవత్సరం లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.మరి వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారు ,డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్దు కలిసి చేస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ కానుంది.

chiru and dj tillu

841 views