Tollywood: 2023 టాలీవుడ్ లో ఇప్పటి వరకు అధిక లాభాలు పొందిన సినిమా లు ఇవే..

Posted by venditeravaartha, August 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2023 టాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ గా మారింది అనడం లో సందేహమే లేదు.ఇప్పటి వరకు రిలీజ్ అయినా సినిమా ల లో పెద్ద సినిమా ,చిన్న సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమా కి బ్రహ్మరధం పట్టారు తెలుగు ప్రజలు.ఈ సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ అయినా చిరంజీవి ,బాలకృష్ణ సినిమా లు పండగ ని బాగా క్యాష్ చేసుకుని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి,ఇక తర్వాత రిలీజ్ అయినా ధనుష్ సార్ ,నాని దసరా ,సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా లు వారి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ ని రాబట్టగా చిన్న సినిమా లు సైతం హావ ని చూపించాయి.మరి ఇప్పటి వరకు రిలీజ్ అయినా సినిమా ల లో వాటి బడ్జెట్ ,ప్రీ బిజినెస్ ని బట్టి అవి సాధించిన కలెక్షన్స్ ఆధారంగా ఎక్కువ లాభాలను సాధించిన సినిమా లు ఏవో చూద్దాము ఇప్పుడు..

walter veeraih

వాల్తేర్ వీరయ్య: మెగాస్టార్ చిరంజీవి ,రవి తేజ కాంబినేషన్ లో బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా గా రికార్డు బద్దలు కొట్టింది.బాలకృష్ణ గారి వీర సింహారెడ్డి సినిమా కి పోటీ గా వచ్చిన ఈ సినిమా టోటల్ గా 230 కోట్ల కలెక్షన్ సాధించి దాదాపు 46 కోట్ల నెట్ ప్రాఫిట్ ని అందుకుంది.ఇప్పటి వరకు తెలుగు లో రిలీజ్ అయినా సినిమా ల లో వాల్తేర్ వీరయ్య అత్యధిక లాభాలు పొందిన సినిమా గా మొదటి స్థానం లో ఉంది.

baby

బేబీ:ఈ సంవత్సరం రిలీజ్ అయినా సినిమా ల లో అతి చిన్న సినిమా గా రిలీజ్ అయ్యి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా మరీనా సినిమా బేబీ.ఆనంద్ దేవరకొండ ,విరాజ్ ,వైష్ణవి చైతన్య కలయిక లో సాయి రాజేష్ దర్శకత్వం లో వచ్చిన బేబీ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ గా అందరిని మెప్పించి
ఇప్పటి వరకు 70 కోట్ల పైన కలెక్షన్ సాధించి దాదాపు 35 కోట్ల నెట్ ప్రాఫిట్ ని అందుకుంది.

sir

సార్:తమిళ స్టార్ హీరో ధనుష్ కి తెలుగు లో ఎలాంటి ఆదరణ ఉంది అనేది అందరికి తెలుసు ఎడ్యుకేషన్ ని ప్రధానముగా తీసుకుని చేసిన సార్ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అద్భుతమైన కలెక్షన్ ల ను రాబట్టింది.ధనుష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించ్చిన మూవీ గా ఒక్క తెలుగు లోనే 27 కోట్ల నెట్ ప్రాఫిట్ ని సాధించింది.

విరుపాక్షణ:మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ తర్వాత కం బ్యాక్ ఇచ్చిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడమే కాకుండా సాయి ధరమ్ తేజ్ కి తన కెరీర్ కి ఎంతో ప్లస్ అయింది.ఇక ఈ సినిమా దాదాపు 25 కోట్ల నెట్ ప్రాఫిట్ ని అందుకుంది.

dasara

దసరా:న్యాచురల్ స్టార్ నాని తన నట విశ్వరూపం చూపించిన సినిమా దసరా , కీర్తి సురేష్
కూడా అద్భుతమైన నటన తో అందరిని ఆకట్టుకుంది.శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా తోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు బద్దలు కొట్టారు.ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో 14 కోట్ల నెట్ ప్రాఫిట్ ని సాధించింది.

ఇక చిన్న సినిమా లు గా వచ్చిన రైటర్ పద్మభూషణ్ ,బలగం ,సమజవరాగమనా సినిమా లు వాటి బడ్జెట్ కి చేసిన బిజినెస్ కి మూడు రేట్లు కలెక్షన్స్ సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్ లు గా
నిలిచాయి.ఇక రానున్న సినిమా ల లో భారీ బడ్జెట్ సినిమా లు ఉండటం తో ఈ సంవత్సరం తెలుగు సినిమా ల హావ మాములుగా ఉండదు అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

1947 views