March OTT Releases: మార్చిలో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. రిలీజ్ డేట్లు ఇవే

Posted by RR writings, March 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

March OTT Releases: వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ నెలలో చాలా సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షలు కూడా ముగుస్తాయి. దీంతో విద్యార్థులు ఖాళీగా ఉండడంతో మార్చి నెలలో కొత్త సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నింటికంటే హాట్ ఫేవరేట్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్‌’ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలి మలయాళ బ్లాక్‌బస్టర్స్ బ్రహ్మయుగం, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ కూడా OTT ప్రీమియర్ కోసం షెడ్యూల్ చేయబడ్డాయి. ఆ లిస్టు ఏంటో ఓ సారి చూద్దాం.

మార్చిలో ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సినిమాలివే
ఈగల్ : మార్చి 1 – ప్రైమ్ వీడియో, ETV విన్
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్: 1 మార్చి , ఆహా
వళరి : మార్చి 6 – ETV విజయం
హనుమాన్ : మార్చి 8, జీ 5
అన్వేషిప్పిన్ కండెతుమ్‌ : మార్చి 8th : నెట్‌ఫ్లిక్స్
ట్రూ లవర్: మార్చి 8th- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
యాత్ర 2: మార్చి 8th – అమెజాన్ ప్రైమ్ వీడియో
లాల్ సలామ్: మార్చి 9వ తేదీ – సన్ NXT, నెట్‌ఫ్లిక్స్
మిక్స్‌అప్ : 15 మార్చి – ఆహా
ఊరు పేరు భైరవకోన: మార్చి 15 – జీ 5
ఫైటర్: 21 మార్చి – నెట్‌ఫ్లిక్స్
ఇవి కాకుండా హర్ష చెముడు సుందరం మాస్టర్‌తో పాటు సిద్దార్థ్ రాయ్ అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కూడా ఈ నెలలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.

1012 views