Takkar: టక్కర్ మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, June 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

లవర్ బాయ్ సిద్దార్ధ్ కి తెలుగు లో సరైన హిట్ వచ్చి కొని సంవత్సరాలు అయిపోతుంది.తనకి తెలుగు లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు లో స్ట్రెయిట్ సినిమా లేని సిద్దార్ధ్ ఈ మధ్య శర్వానంద్ తో మహాసముద్రం సినిమా చేసి నిరాశపరిచారు.ఇక ఇప్పుడు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం లో టక్కర్ అంటూ మన ముందుకు వచ్చారు సిద్దార్ధ్..మరి ఈ టక్కర్ సినిమా తనకు బ్రేక్ ఇచ్చిందా ? లేదా చూద్దాం..

takar siddardh

కథ:గుణశేఖర్ (సిద్దార్ధ్) కుటుంబ ఆర్ధిక స్థితి సరిగాలేకపోవడం తో తన చిన్నతనం నుంచి బాధ పడుతూ ఉంటాడు.అయితే ఎలా అయినా తన ఫ్యామిలీ ని ఈ ఆర్ధిక కష్టాల నుంచి బయట పడేయాలి అని అనుకుంటాడు.దాని కోసం కొన్ని చిన్న చిన్న జాబ్స్ చేసినప్పటికీ తనకి కావల్సినది మాత్రం సాధించలేడు.తాను పని చేసే ప్రతి దగ్గర బెదిరింపులు వస్తుంటాయి..
జీవితం అతనికి ధనవంతుడయ్యే అవకాశాన్ని అందించినప్పుడు దాని కోసం తాను తన జాబ్ ని వేరేలా వాడాల్సి వస్తుంది, కానీ అది చేయడంలో విఫలమై సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత గుణశేఖర్ ఏం చేశాడు? గుణశేఖర్ జీవితంలోకి లక్కీ (దివ్యాంశ కౌశిక్) ప్రవేశం తో అతని జీవితం ఎలా మారింది అనేది మిగిలిన కథ.

siddardh

విశ్లేషణ:ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తన నటన లో ఎటువంటి చేంజ్ లేదు అని చూపించాడు సిద్దార్ధ్.సినిమా ని తన బుజాల మీద వేసుకుని మోశాడు అనడం లో అతిశయోక్తి లేదు.సినిమా మొదట్లో తాను ఆత్మహత్య కి ప్రయత్నిచే సీన్ తో ప్రారంభమైన సినిమా చివరి వరకు కూడా సిద్దార్ధ్ తన నటన తో సినిమా ని కాపాడటానికి చాల ట్రై చేసాడు అని చెప్పొచ్చు
హీరోయిన్ గా దివ్యాన్ష తన పరిధి వరకు బాగానే నటించింది.అయితే అంత పెద్ద తారాగణం పెట్టుకుని దానికి తగిన కథను తీయలేకపోవడం తో కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.
సిద్ధార్థ్ మరియు ఇతర నటీనటులు ఈ ప్రాణములేని యాక్షన్ థ్రిల్లర్‌లో తమ పరిధిని మించి నటించిన జీవం లేని కథ కి ప్రాణం పోయలేకపోయారు.
పాజిటివ్:సిద్దార్ధ్,కామెడీ ,ఫస్ట్ హాఫ్.
నెగటివ్:కథ ,స్క్రీన్ ప్లే ,డైరెక్షన్,సెకండ్ హాఫ్.
రేటింగ్:2 .25 / 5
చివరిగా సిద్దార్ధ్ ని ఇష్టపడే వారు తన కోసం ఒక సారి చూడొచ్చు.

507 views