Arjun Sarja :షూటింగ్ స్పాట్ లో హీరో అర్జున్ ని కొట్టి బండ బూతులు తిట్టిన ఆ స్టార్ డైరెక్టర్!

Posted by venditeravaartha, November 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కమర్షియల్ సినిమాలే కాక ఓ స్పెషల్ జానర్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. నటుడిగా, దర్శకుడిగా, హోస్టుగా, నిర్మాతగా మల్టి టాలెంటెడ్ రోల్స్ ప్లే చేస్తుంటాడు. అర్జున్ తండ్రి కూడా దర్శకనటుడు. ఆయన కూతురు కూడా హీరోయిన్. బ్రదర్, వైఫ్ అందరూ సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు. దీంతో వారి ఇంటి పేరే నటనాలయంగా మారిపోయింది. ఇటీవల ఆయన తన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పరిశ్రమలో తన ప్రారంభ రోజుల అనుభవాలను తెలియజేశారు.

నాన్న గారి పాత్రలు చూస్తున్నప్పుడు ఆయననకు అబ్జర్వ్ చేసేవారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అసలు నాకు సినిమాల్లోకి వచ్చే ముందు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పారు. మొదటి సినిమాలో ఏడ్చే సీన్ ఉంటే దాంట్లో డైరెక్టర్ ఏడ్వమంటే నవ్వాడట. దీంతో డైరెక్టర్ కొట్టాడని చెప్పుకొచ్చారు. నాకు ఏడ్చే అలవాటే లేదు.. ఏడ్వమంటే ఎలా ఏడ్చేది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో తన తండ్రి దగ్గరకు వెళ్లి ఇది నా వల్ల కావడం లేదంటే.. ఛీ నాకొడకా ఇప్పుడే వచ్చి ఒక్క స్టెప్ వేసి అప్పుడే నా వల్ల కావడం లేదంటావా అంటూ మా నాన్న తిట్టాడని చెప్పుకొచ్చారు. అప్పుడు నన్ను రమ్మని షర్ట్ విప్పమని బాడీ బాగుంది సినిమా తీస్తావా అంటే ఓకే అన్నాను. కానీ నాకు యాక్టింగ్ అంటే అప్పుడేమీ తెలియదు. ఓ 30..40 సినిమాలు సినిమాలు తీసిన తర్వాతగానీ ఇదే నా బ్లడ్, బట్టర్ అని అర్థం చేసుకున్నాను.

సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కొంతకాలంగా వరుస పరాజయాలు చవిచూశానని అర్జున్ చెప్పాడు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాబట్టకపోవడంతో తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. అర్జున్ తన స్వంత జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. సౌతిండియాలో తన అనుభవాన్ని వివరించిన అర్జున్, తనకు సినిమా ఆఫర్లు రావడం మానేసిన సమయం ఉందని చెప్పాడు. సొంతంగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నానని, సినిమాలు చేస్తూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు.

“షూటింగ్ జోరుగా సాగుతోంది, నా చేతిలో నగదు లేదు. బెంగుళూరులో ఆ సమయంలో మా తల్లిదండ్రులకు ఉన్న ఇంటిని అమ్మి మా అమ్మ నాకు డబ్బు పంపింది. మా అమ్మ సపోర్ట్, ధైర్యంతోనే నేను ఇంత ఎత్తుకు ఎదిగి విజయం సాధించాను” అని ఆయన గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అర్జున్ ఇప్పటి వరకు 150 సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. సినిమాల్లో కూడా నెగెటివ్ రోల్స్ చేసి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అర్జున్ కూడా అనేక చిత్రాలను నిర్మించాడు. అతను రియాలిటీ టెలివిజన్ షో సర్వైవర్ హోస్ట్ చేశాడు. ప్రసిద్ధ అమెరికన్ అడ్వెంచర్ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ షో రూపొందించబడింది.

Tags :
761 views