Prabhas: ఆయనను చూసి ప్రభాస్ కొడుకు అంటున్నారు..!

Posted by venditeravaartha, July 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తక్కువ సమయంలో సెలబ్రెటీలు కావడాని సినీ రంగమే బెస్ట్ ఆప్షన్. ఒక్క సినిమా హిట్టయితే చాలు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వస్తుంది. ఆ సినిమాలో నటన బాగుంటే వారిని అందలమెక్కిస్తారు. అయితే ఎంత ఎత్తుకు ఎత్తుకుంటారో.. కొందరు అంతే స్థాయిలో రూమర్స్ క్రియేట్ చేస్తూ వారి పరువు తీస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా మార్కెట్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఇటీవల ఆయన నటించిన ‘ఆది పురుష్’ ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నా పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం వార్తలు వస్తుంటాయి. కానీ రెబల్ స్టార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోడు. తాజాగా ఆయనపై ఓ సంచలన ఆరోపణ క్రియేట్ అవుతోంది. ఇటీవల ఓ రాజకీయ నాయకురాలి కుమారుడి ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. ఈయనను చూసి అచ్చం ప్రభాస్ లాగే ఉన్నారంటున్నారు.

rajareddy

సాధారణంగా ఇలాంటి కామెంట్ చేస్తే పర్వాలేదు. కానీ ద్వంద్వార్థం వచ్చేలా కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో ప్రభాస్ పై అనేక విషయాలు కొందరు క్రియేట్ చేశారు. ప్రభాస్ కు ఓ రాజకీయ నాయకురాలికి సంబంధం ఉందని, వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అన్నారు. అయితే ఆ తరువాత అటు రాజకీయనాయకురాలు ఈ పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. ఇటు ప్రభాస్ కూడా ఇలాంటివి క్రియేట్ చేసేవారిని వదలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభాస్ పై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.

sharmila

కానీ తాజాగా అప్పుడు ప్రభాస్ తో అంటగట్టిన రాజకీయ నాయకురాలు తన కుమారుడితో కలిసి బయట కనిపించింది. ఆయనను చూసి హీరోలా ఉన్నాడు, సినిమాల్లోకి వస్తే బాగా పనికొస్తాడు అని చాలా మంది కొనియాడారు. అయితే మరికొందరు మాత్రం ఈయన అచ్చం ప్రభాస్ లాగే ఉన్నాడని అంటున్నారు. అంతటితో ఆగకుండా ఈయన కొంపదీసి ప్రభాస్ కొడుకా? అని కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టులపై ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వీటిని క్రియేట్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

salaar

ఇక ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన లేటేస్ట్ మూవీ సలార్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. త్వరలో ప్రాజెక్ట్ కే కు సంబంధిచిన అప్డేట్ కూడా ఉండబోతుంది అని అంటున్నారు. ఆ తరువాత రాజా డీలక్స్, తదితర సినిమాలు చేయనున్నాడు. అయితే చాలా మంది ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందని, ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ఈ సందర్భంగా సరదా కామెంట్లు పెడుతున్నారు.

4073 views