Samajavaragamana: సామజవరాగమనా మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, June 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు,తాను ఎంచుకునే కథ లే శ్రీ విష్ణు ని ఈ స్థాయిలో ఉంచాయి అని చాల మంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతారు.తన లో ఉన్న అతి పెద్ద పాజిటివ్ కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్.అయితే ఇప్పుడు పూర్తి స్థాయి వినోద భరితమైన కథ తో మన ముందుకు వచ్చారు శ్రీ విష్ణు.రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో గోపి సుందర్ గారి మ్యూజిక్ లో రాజేష్ దండా నిర్మించిన సమజవరాగమనా మూవీ 29 జూన్ ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ అయింది.మరి ఈ సినిమా తో శ్రీ విష్ణు బ్లాక్ బస్టర్ సాధించాడా లేదా ? చూద్దాం !.

sree vishnu

కథ: బాలు(శ్రీ విష్ణు ) అల్లరిగా తిరుగుతూ హ్యాపీ గా ఉండే కుర్రాడు,ప్రేమ లో విఫలం అయినా బాలు తన జీవితం ఏ అమ్మాయి ని కూడా లవ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు
అందువల్లే ఎవరు అయినా తనకి లవ్ యు అని చెప్తే వారి చేత రాఖి కట్టించుకుని వారిని తన సోదరి వలె చూస్తాడు.అయితే కొన్ని పరిస్థుతుల లో బాలు సరయు (రెబ మౌనిక జాన్) ని ప్రేమిస్తాడు.వీరు ఇద్దరు ప్రేమ లో ఉండగానే బాలు అత్త కుమారుడు కి సరయు సిస్టర్ తో పెళ్లి కుదురుతుంది.ఇలా ఉన్న సమయం లో బాలు ,సరయు ఇద్దరి ప్రేమ కి చిక్కులు వస్తాయి
ఎలా అయినా సరే వీరి ప్రేమ ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్న టైం లో బాలు తండ్రి
సీనియర్ నరేష్ అలానే సరయు తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఏమి చేసారు అనేది సినిమా లో ట్విస్ట్, నరేష్ డిగ్రీ పాస‌యితే కోట్ల ఆస్తి ద‌క్కేలా అత‌ని తాత‌య్య రాసిన వీలునామా ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

samajavaragamana

విశ్లేషణ:బాలు పాత్రా లో శ్రీ విష్ణు చాల అద్భుతంగా అలరించాడు అనే చెప్పాలి,మొదట సీన్ నుంచి చివరి సీన్ వరకు కూడా సినిమా అంతటా మంచి కామెడీ ని పండించారు.శ్రీ విష్ణు తో పాటు గా ఈ సినిమా లో సీనియర్ యాక్టర్ నరేష్ ,శ్రీకాంత్ అయ్యంగార్ అలానే వెన్నల కిషోర్ గారి పాత్రలు హైలైట్ గా నిలిచాయి.దర్శకుడు తాను ఎంచుకున్న కథ ని ఫుల్ ఎంటర్టైనర్ గా చూపించడం లో సక్సెస్ అయ్యాడు.కొంచెం ఎక్కడో చూసిన కథ అనిపించినప్పటికీ కూడా బోర్ కొట్టదు.మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్ లు అయితే సినిమా కి హైలైట్ గా నిలుస్తాయి.చాల రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ వస్తుంది.
పాజిటివ్:శ్రీ విష్ణు ,కామెడీ ,మ్యూజిక్ ,స్క్రీన్ ప్లే ,సెకండ్ హాఫ్,తారాగణం.
నెగటివ్:స్లో న్యారేషన్,ఫస్ట్ హాఫ్.
రేటింగ్:3 .75 / 5

2245 views