Bro movie: బ్రో తర్వాత సినిమా ల నుంచి బ్రేక్ తీసుకోనున్న సాయి తేజ్.

Posted by venditeravaartha, July 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా ఫ్యామిలీ లో సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది,తన మొదటి సినిమా తో పర్లేదు అనేలా అనిపించుకున్న ఆ తర్వాత తన డాన్స్ ,కామెడీ టైమింగ్ ,నటన తో స్టార్ హీరో స్థాయి కి ఎదిగారు.ఇటీవల రిలీజ్ అయినా విరూపాక్ష తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరో గా రికార్డు ను సృష్టించారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసిన బ్రో సినిమా తో జులై 28 న మన ముందుకు రాబోతున్నారు.తన కెరీర్ లో ఈ సినిమా చాల స్పెషల్ అని చెప్తున్నా సాయి తేజ్ బ్రో తర్వాత తన అభిమానులకి షాక్ ఇవ్వనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

sai tej

2021 సెప్టెంబర్ 10 న హైదరాబాద్ లో బైక్ ఆక్సిడెంట్ కి గురి అయ్యారు,ఆక్సిడెంట్ తర్వాత తాను షూటింగ్ పూర్తి చేసిన రిపబ్లిక్ సినిమా ని రిలీజ్ చేసారు.అయితే దాదాపు రెండు నెలలు బెడ్ మీద ఉన్న సాయి తేజ్ తన ఆర్యోగ్య పరిస్థితి మెరుగు పడిన తర్వాత నూతన దర్శకుడు తో చేసిన పాన్ ఇండియన్ మూవీ విరూపాక్ష తనకి రీ బర్త్ తర్వాత గిఫ్ట్ లాంటిది అని చెప్పొచ్చు
సంయుక్త మీనన్ ,సాయి తేజ్ ప్రధాన పాత్ర లు చేసిన విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా తర్వాత తన మామయ్య పవన్ కళ్యాణ్ గారితో బ్రో సినిమా లో చేసే అవకాశం లభించింది.

virupaksha

అయితే ఆక్సిడెంట్ తర్వాత విరూపాక్ష షూటింగ్ లో పాల్గొన్న సాయి తేజ్ కి తన శరీరం పూర్తి స్థాయి లో సహకరించలేదు అనేది వాస్తవం,అలానే రెండు ,మూడు నెలలు బెడ్ మీద కోమా లో ఉండటం తో తనకి వాయిస్ కూడా సరిగా రాలేదు,విరూపాక్ష సినిమా లో తన డైలాగ్ ని చూస్తే మన కి అర్ధం అవుతుంది.ఇక పవన్ కళ్యాణ్ గారితో చేసిన బ్రో సినిమా లో ప్రధాన పాత్రా లో తానే చేస్తుండటం తో ఆ క్యారెక్టర్ కోసం చాల కష్టపడ్డాను అని చెప్పారు అయినా కూడా తాను 100 % ఫిట్ గా లేను అని చెప్పారు.ఇటీవల రిలీజ్ అయినా బ్రో రెండవ సాంగ్ లో సాయి తేజ్ డాన్స్ చూస్తే తాను ఇంకా ఫుల్ గా రికవర్ కాలేదు అనిపిస్తుంది.ఇక ఇదే విషయాన్నీ తానే మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత 6 నెలల పాటు ఎటువంటి సినిమా లు చేయకుండా తన ఆరోగ్యం మీదనే ద్రుష్టి పెట్టి ఆ తర్వాత తన అభిమానులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అన్నారు.

bro

2007 views