మెగా స్టార్ చిరంజీవి గారి తమ్ముడు గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత తన కంటూ సెపెరేట్ స్టైల్ ,ట్రెండ్ సెట్ చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే తాను వివిధ పరిస్థుతుల లో మూడు వివాహాలు చేసుకున్నారు.ఇక సమాజం పట్ల ఉన్న బాధ్యత తో తన సినిమా ల లో ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే అంశాలను పెట్టడమే కాకుండా వాటిని ఆచరణ లో కూడా పెట్టారు.ప్రజారాజ్యం సమయం లో కామన్ మాన్ ప్రొటెక్షన్ కోసం కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్థాయి తెలుస్తుంది.
తనకి ఉన్న ఏకైక ఆర్ధిక మార్గం అయినా సినిమా ని చేస్తున్నారు ,అందులో వచ్చిన డబ్బులను తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు.అయితే ఇటీవల రిలీజ్ అయినా బ్రో మూవీ బ్లాక్ బస్టర్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ లో వరుసగా వకీల్ సాబ్,బీమ్లా నాయక్ ,బ్రో ల తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లను సాధించారు.తన మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రా లో చేయగా ఇందులో టైం గాడ్ పాత్రా లో పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయం తెలిసిందే.బ్రో సినిమా సాయి తేజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న కి తాను ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల లోకి కి వచ్చిన తర్వాత ఆయన మీద వ్యక్తిగత దూషణలు చేసే వారు ఎక్కువ అయ్యారు.మూడు పెళ్లిళ్లు తప్ప ఆయన ని విమర్శించడానికి మరో అంశం లేని సమయం లో ప్రతి ఒక్కరు కూడా మూడు మూడు పెళ్లి లు చేసుకున్నాడు ,చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాడు దత్త పుత్రుడు ,ప్యాకేజి తీసుకున్నారు అంటూ తీవ్ర స్థాయి లో విమర్శలు చేస్తున్నారు.సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినా జగన్ కూడా మూడు పెళ్లిళ్లు తప్ప మరొక అంశం మీద మాట్లాడారు.పాలసీ ల మీద అవగాహనా లేకుండా అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణ చేస్తారు.
ఇక ఇదే విషయాన్నీ సాయి ధరమ్ తేజ్ ని మీ మామయ్య అంత లక్సరీ లైఫ్ ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల లో వచ్చి తన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ కూడా అందరి చేత మాటలు పడుతున్నారు కదా అని అడగక దానికి సాయి తేజ్ రిప్లై ఇస్తూ..మామయ్య పాలిటిక్స్ లో కి వెళ్లే టైం లో మా అందరిని పిలిచి నేను రాజకీయాల ల లో ఉన్నపుడు నా మీద వ్యక్తిగత దూషణలు చేస్తారు ఆ టైం లో మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకండి ,మీరు అలా అయితే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు..వాళ్ళని ఎలా ఎదుర్కొనాలి అనేది నాకు తెలుసు అన్నారు.