Rashmika : ఊహించిందే నిజమైంది.. ‘వీడీ’నే తనకు భర్తగా కావాలంటున్న రష్మిక

Posted by RR writings, February 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Rashmika : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడాలు.. పెళ్లి చేసుకోవడాలు ఇటీవల కాలంలో సర్వ సాధారణం. అదేవిధంగా పెళ్లికి ముందు కాబోయే భర్త ఇలాగే ఉండాలి అంటూ కొందరు హీరోయిన్లు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక మందన్నా కూడా తన కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన ఈ క్యూటీ రీసెంట్ గా యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకుంది.

వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఈ హీరోయిన్ పుష్ప 2 ది రూల్ లో కనిపించబోతున్నారు. సోషల్ మీడియా లో ఒక అభిమాని చేసిన పోస్ట్ కు హీరోయిన్ రష్మిక రెస్పాండ్ అయ్యారు. తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ పరంగా రష్మిక చాలా బిజీ బిజీగా ఉన్నప్పటికీ.. ఈ క్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

రష్మిక మందన్న కి కాబోయే భర్త ఎలా ఉండాలి అంటూ అభిమానికి చెప్పుకొచ్చింది. ఎంతైనా నేషనల్ క్రష్ కదా తనకు కాబోయే భర్త మరింత స్పెషల్ గా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. తన భర్త VD లా ఉండాలి. డేరింగ్ గా, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు కాబోయే భర్త మరింత స్టైలిష్ గా ఉండాలని, అలాగే తన భర్త కూడా వీడీలా ఉండాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు అతడికి ఎప్పుడూ అండగా ఉంటానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

339 views