RAMABANAM:రామబాణం మూవీ రివ్యూ

Posted by venditeravaartha, May 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మ్యాచో స్టార్ గోపీచంద్ ‘తొలి వలపు ‘ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన సరైన బ్రేక్ రాలేదు ,జయం ,నిజం ,వర్షం వంటి సినిమా ల లో విల్లన్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత యజ్ఞం వంటి బ్లాక్ బస్టర్ లో హీరో గా నటించారు,ఇక వరుసగా ఆంధ్రుడు ,రణం,లక్ష్యం,సౌర్యం లాంటి హిట్లు వచ్చాక కొన్ని ప్లాప్ ల ను ఎదుర్కున్న గోపీచంద్ 2014 లో లౌక్యం తో మరల హిట్ ట్రాక్ పట్టారు,ఇప్పుడు అదే డైరెక్టర్ తో హ్యాట్రిక్ కొట్టాలని ‘రామ బాణం’ సినిమా తో మే 5 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ఈ సినిమా గోపీచంద్ గారికి సూపర్ హిట్ ని ఇచ్చిందో లేదో చూద్దాం!

కథ:విక్కీ(గోపీచంద్),జగపతి బాబు ఇద్దరు అన్న దమ్ములు ఒకరు ఏమో ఊర్లో ఉండి ప్రజల బాగు కోసం మంచి ఆహరం తింటేనే అనారోగ్యాలు రాకుండా ఉండగలరు అని ఫార్మింగ్ చేస్తూ జనాల కోసం ఉంటారు,గోపీచంద్ కొలకత్తా లో డాన్ ల ఉంటాడు,అక్కడ యూట్యూబర్ అయినా భైరవి (డింపుల్ హయతి) తో ప్రేమ లో పడతాడు,ఇక అక్కడ ఉంచి విక్కీ ఎందుకు తన ఉరికి తిరిగి వెళ్ళాడు,జగపతి బాబు కి గోపీచంద్ కి మధ్య ఉన్న బంధం కి మధ్యలో వచ్చిన సమస్యలు ఏంటి,ఆ సమస్యలను ఎలా క్లియర్ చేసారు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:డైరెక్టర్ శ్రీవాస్ ,గోపీచంద్ కలయిక లో ఇది వరకు వచ్చిన లక్ష్యం,లౌక్యం సినిమా ల మాదిరిగానే ఈ సినిమా కూడా లవ్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలగలిసిన సినిమా,ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్ లు ,గోపీ చంద్ మార్క్ టైమింగ్ ప్రేక్షకులని కొంచెం నవ్విస్తుంది,కానీ రొటీన్ గా సాగె కథ ,కథ నాలు మాత్రం పాత చింతకాయ పచ్చడి వలె అనిపిస్తుంది,ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలి అంటే ఏదైనా కొత్త సబ్జెక్టు తీసుకుని తెస్తే జనాల్ని మెప్పిస్తుంది ,అంతే కానీ ఇది వరకు ఉన్న 2 ,3 సినిమా ల లోని సీన్ ల ను లేపేసి తెస్తే రిజల్ట్ ఆశించిన విధముగా ఉండదు. లక్ష్యం ,లౌక్యం రేంజ్ లో ‘రామ బాణం’ లేదు అనేది మాత్రం క్లియర్ గా అర్ధం అవుతుంది.క్లీన్ హిట్ కావాలి అంటే 16 కోట్లు కలెక్షన్ సాధించి ఉండాల్సి ఉండగా ఏ మాత్రం కలెక్షన్ లు వస్తాయో చూడాలి.
పాజిటివ్ :గోపీచంద్ ,కామెడీ.
నెగటివ్ :పాత కథ,స్క్రీన్ ప్లే ,వీక్ ఎమోషన్స్.
రేటింగ్:2 .25 / 5

3500 views