Pushpa2: ‘పుష్ప2’.. దాదాపు ఖరారు..!

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) నటించిన పుష్ప మూవీ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలసిందే. దీని సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పార్ట్ 1 రిలీజ్ అయిన ఏడాది తరువా గతేడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టిన షూటింగ్ బృందం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సుకుమార్ అదిరిపోయే అప్డేట్ ను సుక్కు ఆడియన్స్ ముందు ఉంచారు. పుష్ప(Pushpa) మొదటి సినిమా ఊహించని లెవల్లోకి తీసుకొచ్చిన ఆయన పార్ట్ 2న ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా తీర్చి దిద్దుతున్నాడట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుుడు మరో న్యూస్ ఆడియన్స్ లో మరింత వేడిని పెంచుతోంది. అదేంటంటే?

allu arjun

సుకుమార్(Sukumar) డైరెక్షన్ రెడీ అవుతున్న పుష్ప 2 గత డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? అని మెగా ఫ్యాన్స్ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆత్రుతను అర్థం చేసుకున్న సుక్కు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2కు సంబంధించిన బన్నీ లుక్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన వీర లెవల్లో కనిపించే అవకాశం ఉంది. మొదటి సినిమాలో కార్మికుడిగా కనిపించన బన్నీ రెండో మూవీలో రూల్ ఆఫ్ ది మ్యాన్ గా సందడి చేయనున్నారు.

where is pushpa

ఇక పుష్ప 2(Pushpa2) ఎప్పడు రిలీజ్ అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ డిసెంబర్ 22న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మరో నెల పాటు మిగతా షూటంగ్ ను కంప్లీట్ చేసి ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనున్నారు. మొత్తానికి డిసెంబర్ 22న పుష్ప 2 థియేటర్లోకి రానున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కన రష్మిక మరోసారి నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా మెరిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

pushpa2

పుష్ప పార్ట్ 1లో ఎండింగ్ ఎంట్రీ ఇచ్చిన విలన్ నెక్ట్స్ మూవీలో మరింత అదరగొట్టనున్నట్లు తెలుస్తుంది. ఓ వీడియో రిలీజ్ చేసిన దానిని బట్టి చూస్తే రెండో మూవీలో పుష్ప కాసేపు కనిపించకుండా పోతారని, ఆ తరువాత మళ్లీ కనిపించి ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మికలతో పాటు కొంత మంది కొత్త నటులను పరిచయం చేయనున్నారు. వీరు ఎక్కువగా బాలీవుడ్ నుంచి ఉంటారని సమాచారం

pushpa 2 poster

845 views